Theme Of Bro: తమన్ కొట్టుడు.. ఈసారి ఎలా ఉందంటే..

బ్రో థీమ్ లిరికల్​ లీడియో సాంగ్​ను రిలీజ్ చేసింది.

Update: 2023-07-25 07:12 GMT

పవర్​ స్టార్ పవన్ కల్యాణ్ - మెగా యంగ్ హీరో సాయితేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్​ మూవీ 'బ్రో'. జులై 28న రిలీజ్​కు రెడీ అయింది. అంటే మరో మూడు రోజుల్లో బాక్సాఫీస్​ వద్ద పవన్ సందడి కనిపించనుంది. అయితే అభిమానుల్లో మరింత జోష్​ నింపేందుకు మూవీటీమ్​.. బ్రో థీమ్ లిరికల్​ లీడియో సాంగ్​ను రిలీజ్ చేసింది.




 


వాస్తవానికి పవన్ కల్యాణ్​ సినిమా అంటే రిలీజ్​ కొద్ది రోజుల ముందు నుంచే సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ ఈ సారి ఆ రేంజ్ ​లో కనపడట్లేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్​, రెండు పాటలు అభిమానులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు. వాటికి సోషల్​ మీడియాలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్​ రాలేదు. పవన్ అభిమానులు కాస్త నిరుత్సాహంగా కనిపించారు.

అయితే ఇప్పుడు వారిలో జోష్ ​ను ఎలాగైనా రెట్టింపు చేసేందుకు మూవీ టీమ్​ బ్రో థీమ్​ సాంగ్​ను విడుదల చేసింది.పవన్ పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ థీమ్ సాంగ్ కొనసాగింది. కాలం నేపథ్యంలో నడిచే కాన్సెప్ట్​కు తగ్గట్టుగా, పవన్ 'టైమ్​' పాత్రను హైలైట్ చేస్తూ ఈ పాటకు లిరిక్స్ అందించారు.

'కాల త్రిగుణ సంశ్లేషం కాల గమణ సంకాశం' అంటూ లిరిక్స్​ సంస్కృత పదాలతో సాగుతోంది. అయితే తమన్ సమకూర్చిన బాణీలు, స్వరపరిచిన బీట్​ తీరు ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్​ పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ సీన్‌లో వచ్చేదిగా కనిపిస్తోంది.

మొత్తంగా సాహిత్యంతో కూడిన ఈ పాట ఆద్యంతం వినసొంపుగా ఉంది. హై ఫీల్‌ను అందిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాపై స్పెషల్​ హైప్​ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఇక ఈ పాటకి కల్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించాడు. చూడాలి మరి ఈ పాట సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతుందో.

ఇకపోతే సినిమాలో పవన్‌ కళ్యాణ్​ను టైమ్​ అనే మోడ్రన్ దేవుడి పాత్రలో చూపించారని తెలిసంది. పవన్ సన్నివేశాల కోసం త్రివిక్రమ్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్క్రీన్‌ ప్లే డైలాగ్స్ రాశారని చెబుతున్నారు. ఇక చిత్రంలో చివరి 20 నిమిషాల పాటు గుండెలను పిండేసే ఎమోషనల్ సీన్స్​ ఉంటాయని తెలిసింది. సినిమాలో సాయి ధరమ్‌ తేజ్ సరసన కేతిక శర్మ నటించింది. మరో కీలక పాత్రలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ నటించింది. ఒరిజినల్ వెర్షన్​ కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఈ రీమేక్​కు కూడా దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.


Full View


Tags:    

Similar News