అందుబాటులోకి వచ్చిన సాంకేతికత పుణ్యమా అని.. రకరకాల మేజిక్కులు చేయటం తెలిసిందే. మామిడి.. జామ.. దానిమ్మ.. సపోటా ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నలభై రకాల పండ్ల వెరైటీలను ఒకే చెట్టుకు పూయించటం సాధ్యమేనా? సహజంగా అయితే.. ఇది అసాధ్యం కానీ.. ప్రత్యేక పద్ధతులతో ఇలాంటి అసాధ్యాన్ని సాధ్యం చేశారు అమెరికాకు చెందిన ఒక పేద్ద ప్రొఫెసర్.
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రొఫెసర్ గారు వాన్.. సిరాకస్ విశ్వవిద్యాలయంలో పాఠాలు చెబుతుంటారు. తన అభిరుచి మేరకు.. ఒక ప్రత్యేకమైన చెట్టును రూపొందించే క్రమంలో ఈ నలభై రకాల పండ్ల మొక్కును రూపొందించారు.
సీజన్ కు తగినట్లుగా.. పండ్లను కాస్తూ.. చూపురుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఈ చెట్టు.. రంగురంగుల్లో దర్శనం ఇస్తూ.. తాను మిగిలిన వారి కంటే చాలా డిఫరెంట్ అన్నట్లుగా కనిపించటం మరో విశేషం.
మరి.. ఇలాంటి చిత్రమైన చెట్టును సొంతం చేసుకోవటం సాధ్యమేనా అంటే.. డబ్బులుంటే సాధ్యం కానిదేదీ లేదన్న మాటను నిజం చేస్తూ.. ఇలాంటి విచిత్రమైన చెట్టును 30వేల డాలర్లు (మన రూపాయిల్లో కేవలం 18 లక్షలు మాత్రమే సుమి) మనవి కాకుండా తయారు చేసి ఇచ్చేస్తానని చెబుతున్నారీ ప్రొఫెసర్ గారు. మరిన్ని లక్షలు పోసిన కొనే చెట్టు కాయలు కాసేందుకు మాత్రం ఏడాది నుంచి.. పదేళ్ల కాలం పడుతుందని సెలవిస్తున్నారు. డబ్బులు పోసి కొనగానే.. 40 రకాల పండ్లు కాయటం మాత్రం దీన్ని తయారు చేసిన ప్రొఫెసర్ గారి చేతుల్లో లేకపోవటం గమనార్హం.