స్వదేశంలో ఆస్తుల రక్షణ... ఎన్నారైలకు షాకింగ్ సమస్య!
ఒకప్పుడు విదేశాల్లో ఉద్యోగలు చేసుకుంటున్న ఎన్నారైలకు... సొంత ఊరిని, కన్నవారిని, స్నేహితులను, బంధువులను విడిచిపెట్టి వచ్చామనే బాధ ఎక్కువగా ఉండేదని అనేవారు!
ఒకప్పుడు విదేశాల్లో ఉద్యోగలు చేసుకుంటున్న ఎన్నారైలకు... సొంత ఊరిని, కన్నవారిని, స్నేహితులను, బంధువులను విడిచిపెట్టి వచ్చామనే బాధ ఎక్కువగా ఉండేదని అనేవారు! అయితే... ఇప్పుడు మాత్రం ఆస్తులు అన్నీ అక్కడే ఉండిపోయాయి, ఎవడు ఎత్తుకుపోతాడో అనే టెన్షన్ వచ్చి చేరిందని.. ఇది ఇప్పుడు తీవ్రంగా మారిందని అంటున్నారు.
అవును... నేడు భారతదేశంలో ఎన్నారైలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి.. వారి పూర్వీకుల లేదా వారి పాత ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోకుండా కాపాడుకోవడమే అనే చర్చ బలంగా జరుగుతోంది. ఇటీవల ఇలాంటి ఉదంతాలు పెరుగుతుండటంతో.. అనేక కేసులు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయని అంటున్నారు.
ఇక్కడ ఎన్నారైలు ఆస్తులను చట్టపరమైన స్వాధీనం చేసుకోవడానికి పోటీ పడుతున్నారని అంటున్నారు. ఈ తరహా వివాదాలకు కొన్ని సందర్భాల్లో అపరిచితులు కారణమైతే.. మరికొన్ని సార్లు బంధువులే ఆక్రమణలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ తరహా ఘటనలు ప్రధానంగ ఆస్థి విలువ ఎక్కువగా ఉండే మెట్రో నగరాల్లో జరుగుతున్నాయని అంటున్నారు.
ఈ సందర్భగా... చట్టవిరుద్ధంగా ఆక్రమణకు గురైన ఆస్తులను తిరిగి పొందే క్రమంలో కలిగే మానసిక, ఆర్థిక నష్టాలు చాలా భయంకరంగా ఉన్నాయని.. చాలా మంది ఎన్నారైలు ఇలాంటి కేసులతో వ్యవహరించే క్రమంలో తీవ్ర ఆందోళన, నిరాశ వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.
ఈ విషయాలపై స్పందించిన ఎన్నారై తరుపు న్యాయవాది అభిషేక్ రస్తోగి స్పందిస్తూ... బాధిత ఆస్తి యజమానులకు అందుబాటులో ఉన్న చట్టపరమైన సహాయాన్ని వివరించారు. ఇందులో భాగంగా... ఆస్తి చట్టబద్దమైన యజమానులకు అనేక పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయని.. ముందుగా పోలీసు ఫిర్యాదును నమోదు చేయాలని తెలిపారు.
భారతీయ న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉందని.. ఆస్తి యజమానుల హక్కులను కాపాడేందుకు చట్టం చక్కగా రూపొందించబడిందని.. న్యాయ వ్యవస్థ అటువంటి సందర్భాల్లో ఎన్నారైల హక్కులను పరిరక్షించడంలో తన నిబద్ధతను ప్రదర్శించినప్పటికీ... క్రమబద్ధమైన చట్టపరమైన ప్రక్రియల అవసరాన్ని హైలెట్ చేస్తున్నాయని అన్నారు.