అది పడిపోయినా... పాట ఆగిపోలేదు!

Update: 2015-07-18 09:16 GMT
వేకప్ అమెరికా (అమెరికా... మేలుకో) అని పాటపాడుతున్న ఒక గాయనికి అనుకోని ఇబ్బంది వచ్చి పడింది. అయినా కూడా ఆమె ఏమాత్రం సిగ్గు పడలేదు, కంగారు పడలేదు, అవమానంగానూ బావించలేదు! హాయిగా... మరింత ఊపుతో "అమెరికా... మేలుకో" అంటూ కంటిన్యూ చేసింది!

వివరాళ్లోకి వెళితే... మెక్సికోకు చెందిన ఒక గాయని స్టేజిపై తనదైన శైలిలో పాటలు పాడుతూ జనాలను హుషారెత్తిస్తుంటే... ఆ సమయంళో ఆమె ధరించిన ప్యాడ్ జారిపడిపోయింది! దీంతో అక్కడికి వచ్చిన వారంతా నవ్వడం మొదలు పెట్టారు దీంతో లైవ్ షో కాస్తా బ్యాడ్ షోగా మారిపోతుంది అనుకున్న సమయంలో... ఆ సింగర్ ఏమాత్రం చలించలేదు. ఏమీ జరగనట్టే తన పాటను కొనసాగించింది!

కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ... ఈ ఘటన జరగడం వల్ల తానేమీ సిగ్గు పడడం లేదని, దీనికి ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెప్పింది! మరో విషయం ఏమిటంటే... వేకప్ అమెరికా అనే పాట పాడుతుండగా ఈ సంఘటన జరిగింది!
Tags:    

Similar News