బేబీ.. బడా సినిమాల కంటే గొప్పగా..

బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు మరింత డోస్ పెంచుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

Update: 2023-07-17 16:35 GMT

బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు మరింత డోస్ పెంచుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా కంటెంట్ తోనే మెల్లమెల్లగా కలెక్షన్స్ నెంబర్లను అయితే పెంచుకుంటోంది. అసలు ఈ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. ఇక ఆనంద్ దేవరకొండకు ఇది బెస్ట్ మూవీ అవుతుంది అని చెప్పవచ్చు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా మొదటి సినిమాతోనే జాక్ పాట్ కొట్టేసింది.

అయితే ఈ సినిమాకు మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాగా ఇక మూడవరోజు అంతకుమించి అనేలా కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే రెండవ రోజు పెట్టిన పెట్టుబడికి మొత్తం వెనక్కి తీసుకువచ్చి బయ్యర్లను ప్రాఫిట్ లో పడేసింది. ఇక వీకెండ్ లో ఆదివారం వరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం అనేది సర్వసాధారణమైన విషయం.

ఇక సోమవారం రోజు పెద్ద సినిమాలకు కూడా కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. ఇక హౌస్ ఫుల్ బోర్డులు అనేవి కనిపిస్తే చాలు గొప్ప. ఈ మధ్య ప్రభాస్ ఆదిపురష్ కు కూడా ఫస్ట్ మండే తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పెద్దగా పడలేదు. కానీ బేబీ సినిమా మాత్రం సోమవారం రోజు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది.

అది కూడా మాస్ ఏరియాలలో బీభత్సమైన క్రేజ్ అందుకోవడం విశేషం. సోమవారం రోజు రాయలసీమ వంటి మాస్ ఏరియాలలో కూడా ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇక కడప కర్నూలు తిరుపతి ఏరియాలలో కూడా ఫస్ట్ షోలకు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆంధ్ర ప్రాంతంలో వైజాగ్ లాంటి పెద్ద సిటీలలో కూడా ఈ సినిమాకు అయితే హౌస్ ఫుల్ బోర్డులు పడినట్లుగా తెలుస్తోంది

ఇక నైజం లో అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమా అదేదో రేంజ్ లో నడుస్తోంది. సోమవారం రోజు ఊహించని స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదు అవుతూ ఉండడం రికార్డు అని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో కూడా సోమవారం రోజు 60% నుంచి 70% వరకు ఆక్యుపెన్సీ అయితే నమోదయింది. కేవలం మల్టీప్లెక్స్ లలో మాత్రమే కాకుండా సింగిల్ స్క్రీన్స్ లలో కూడా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుంది. మరి సోమవారం రోజు ఈ సినిమా మొత్తంగా ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Tags:    

Similar News