'బేబీ' ఓవర్సీస్.. అక్కడ కూడా దున్నేస్తోందిగా..
మొత్తంగా ఓవర్సీస్ లోని అన్ని సెంటర్స్ లో బ్లాక్ బాస్టర్ హిట్‌తో దూసుకెళ్తోంది
బాక్సాఫీస్ వద్ద కల్ట్ లవ్ స్టోరీ 'బేబీ' కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. చిన్న సినిమాగా రిలీజైన ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌కు యూత్ తో పాటు సగటు సినీ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై పది రోజులు అవుతున్నా థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోనూ మంచి రికార్డును నమోదు చేస్తోంది. మొదటి వారంలో ఊహించని వసూళ్లను అందుకున్న ఈ చిత్రం రెండో వారంలోనూ దాదాపుగా అదే స్థాయిలో అందుకుంటోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లోనూ ఆశించిన స్థాయి కన్నా ఎక్కువగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే వసూళ్ల విషయంలో ఓ సూపర్ మార్క్ ను కూడా అందుకుంది.
ఓవర్సీస్ లో మొదట కొన్ని రోజులు కాస్త స్లోగా నడించింది. కానీ క్రమక్రమంగా మౌత్ టాక్‌తో అక్కడి థియేటర్లు కూడా హౌస్ ఫుల్ బోర్డులతో నిండిపోతున్నాయి. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 400K డాలర్స్. అయితే ఈ బ్రేక్ ఈవెన్ టార్గెను దాటేసి సినిమా మరిన్ని కలెక్షన్లను వసూలు చేసే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 538K డాలర్స్ ను కలెక్ట్ చేసింది.
అక్కడ ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ వాళ్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు వారికి ఈ చిత్రంతో పంట పండిండి అన్నట్టుగా భారీ లాభాలను అందుకుంటున్నారు. నార్త్ అమెరికాలో మొదటి వారం ఈ చిత్రం 348K డాలర్లను అందుకుంది. ఆ తర్వాత కాస్త స్లో అయింది. కానీ మళ్లీ జోరందుకుని రెండో వారంలో మరో 190K డాలర్లను వసూలు చేసింది. మొత్తంగా ఓవర్సీస్ లోని అన్ని సెంటర్స్ లో బ్లాక్ బాస్టర్ హిట్‌తో దూసుకెళ్తోంది.
అలాగే తెలుగులోనూ మంచి వసూళ్లను అందుకుంది. ఈ చిత్రం మొత్తంగా 10 రోజుల్లో 66.6 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుందంటూ ఇటీవలే మూవీటీమ్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్స్‌లో ఏ,బీ,సీ అన్నీ సెంటర్స్‌లో సినిమా ఇంకా దూసుకెళ్తోంది. ఏ సెంటర్‌తో పోలిస్తే బీ, సీ సెంటర్స్ లో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో తరలివస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య కలిసి నటించారు. చిత్రానికి 'హృదయ కాలేయం', 'కొబ్బరి మట్ట' ఫేమ్ సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు. శ్రీనివాస కుమార్ నాయుడు నిర్మించారు.