బడ్జెట్ రూ.1200 కోట్లు... వసూళ్లు రూ.11,450 కోట్లు
ఇండియన్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి.
ఇండియన్ సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలు చాలా తక్కువ. అయితే హాలీవుడ్ లో మాత్రం వేల కోట్ల బడ్జెట్ తో సినిమాలు రూపొంది పదుల వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. తాజాగా బార్బీ సినిమా సంచలన వసూళ్లు నమోదు చేసింది.
జులై 9న బార్బీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. అదే రోజున హాలీవుడ్ క్రేజీ స్టార్ నటించిన ఒప్పెన్ హైమర్ చిత్రం కూడా విడుదల అయింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బార్బీ తో పోల్చితే ఒప్పెన్ హైమర్ భారీ వసూళ్లు సాధించింది. ఇండియా లో బార్బీ సినిమా రూ.50 కోట్ల లోపు వసూళ్లు సాధించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం రూ.11,450 కోట్ల వసూళ్లు సాధించింది.
బార్బీ సినిమాని దాదాపుగా రూ.1200 కోట్ల తో నిర్మించడం జరిగింది. షూటింగ్ సమయంలో సినిమాకు మరీ ఎక్కువ బడ్జెట్ అయిందనే అభిప్రాయం వ్యక్తం అయింది. కానీ విడుదల తర్వాత బార్బీ సినిమా సాధించిన వసూళ్లు చూసి ప్రతి ఒక్కరు కూడా అవాక్కయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా 10,000 స్క్రీన్ లో విడుదల అయింది. సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ నేపథ్యం లో స్క్రీన్స్ సంఖ్యని మరింతగా పెంచారు. దాదాపు మూడు నెలల పాటు ఈ సినిమా వివిధ దేశాల్లో సందడి చేసింది. మొన్నటి వరకు కూడా ఏదో ఒక దేశంలో సినిమా సందడి చేస్తూనే వచ్చింది.
ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా సినిమా కొన్ని దేశాల్లో థియేట్రికల్ స్క్రీనింగ్ చేశారు. ఆ సమయంలో కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. మొత్తానికి రూ.1200 కోట్ల బడ్జెట్ తో రూపొందిన బార్బీ సినిమా పదుల రెట్లు లాభాలను దక్కించుకుని ఏకంగా రూ.11,450 కోట్ల వసూళ్లను దక్కించుకుని అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది.