బాలయ్య దంచుడు.. రూ.100కోట్లకు చేరువలో..
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సందేశాత్మక చిత్రం 'భగవంత్ కేసరి' థియేటర్ల దగ్గర గర్జిస్తోంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సందేశాత్మక చిత్రం 'భగవంత్ కేసరి' థియేటర్ల దగ్గర గర్జిస్తోంది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇటు మాస్ ఆడియెన్స్‌తో థియేటర్లన్నీ హౌస్ ఫుల్తో కళకళలాడుతున్నాయి. ప్రేక్షకుల తాకిడి ఎక్కువ అవ్వడం, రెస్పాన్స్ భారీగా వస్తుండటం వల్ల మేకర్స్ కూడా స్క్రీన్స్ కౌంట్‌ను పెంచేశారు.
తొలి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్న ఈ సినిమా మూడో రోజు శనివారం కూడా అదే జోరు కొనసాగించింది. మూడో రోజు తెలుగు 2డీలో మార్నింగ్ షో ఆక్యూపెన్సీ 33.87 శాతం, మ్యాట్నీ షో ఆక్యూపెన్సీ 48.60శాతం, ఫస్ట్ షో ఆక్యూపెన్సీ 56.85 శాతం, సెకండ్ షో ఆక్యూపెన్సీ 63.04 శాతం నమోదయ్యాయని తెలిసింది.
మూడో రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్ల వివరాల విషయానికి వస్తే.. నైజాంలో రూ. 3.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.45 కోట్లు, ఏపీలో రూ.4.30 మొత్తంగా 10.65 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఏపీలో వచ్చేసరికి.. వెజాగ్లో రూ.1.01కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 68 లక్షలు, నెల్లూరులో రూ.59 లక్షలు వచ్చాయని పేర్కొన్నాయి. వరల్డ్ వైడ్‌గా మూడో రోజు రూ. 19.90 కోట్ల గ్రాస్ వచ్చిందని తెలిసింది. మొత్తంగా మూడో రోజుల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాస్ రూ.71.02కోట్లు అందుకుందని తెలిసింది.
దేశవ్యాప్తంగా వివరాలను పరిశీలిస్తే.. మొదటి రోజు రూ.16.6కోట్ల నెట్, రెండో రోజు 7కోట్ల నెట్ అందుకున్న ఈ చిత్రం.. మూడో రోజు రూ.7.75కోట్ల నెట్ వసూళ్లను సాధించిందట. అంటే ఇండియా వైడ్‌గా మూడు రోజుల్లో 31.35కోట్ల నెట్ వసూలు చేసింది.
సినిమాలో బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించ్చారు.