మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా విడుదలకు ముందే ఊహించిన విధంగా కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. అసలు సినిమాకు ఏమంత మాత్రం బజ్ క్రియేట్ కాకపోవడంతో మొదటి రోజే కలెక్షన్స్ చిత్ర యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చాయి. కాస్త ప్రమోషన్స్ తో మళ్ళీ హడావుడి చేసినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అదృష్టవం కలిసి రాలేదు.
పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చినందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. మొదటి రోజు ఏపీ తెలంగాణలో 15.38 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు అయితే దాదాపు 70 శాతానికి పైగా ఆ లెక్కలు పడిపోయాయి.
ఇక మొత్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే, ఏరియాలో వారిగా వచ్చిన నెంబర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3.13 కోట్లు షేర్, 5.25 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటువైపు నుంచి కేవలం ఇప్పటివరకు 1.35 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. అక్కడి నుంచి ఇప్పటివరకు 2.12 కోట్లు షేర్ మాత్రమే రాబట్టింది. ఇటీవల కాలంలో చిరంజీవి అతి తక్కువ స్థాయిలోనే అమెరికాలో కూడా చాలా తక్కువ కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో 21.98 కోట్లు షేర్, 34.20 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. భోళా సినిమా ఓవరాల్ గా అయితే 79.60 కోట్లు రేంజ్ లో అయితే ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 80 కోట్లకు పైగా షేర్ కలక్షన్స్ ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
కానీ రెండు రోజుల్లో కేవలం 21 కోట్ల షేర్ మాత్రమే రావడంతో టార్గెట్ పూర్తి అవ్వడానికి ఇంకా నెంబర్లు పెరగాలి. ప్రాఫిట్ లోకి రావాలి అంటే 58.52 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రావాల్సి ఉంది. ఇక శనివారం రోజు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఆదివారం కూడా పెద్దగా మ్యాజిక్ క్రియేట్ చేసే అవకాశం అయితే లేదు. ఏదేమైనా కూడా ఆదివారం రోజు ఎంతో కొంత వెనక్కి తీసుకురావాలి. ఇక సోమవారం రోజు ఈ సినిమా మరింత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది.