భోళా బాక్సాఫీస్.. 15 కోట్ల నుంచి 25 లక్షలకు!

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ అందుకోవడంతో సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు చాలా దారుణంగా తగ్గుతూ వస్తున్నాయి.

Update: 2023-08-15 06:20 GMT

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ అందుకోవడంతో సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు చాలా దారుణంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక సినిమా మొదటి సోమవారం రోజు కలెక్షన్స్ చూస్తే రీమేక్ కమర్షియల్ సినిమాలు తీసే వారికి ఇది ఒక రిస్క్ రూట్ అని కూడా చెప్పవచ్చు.

సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఫ్యాన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. అందులోనూ డైరెక్టర్ మెహర్ రమేష్ కావడంతో మరింత అనుమానాలు వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ సినిమా భారీ బడ్జెట్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఊహించని స్థాయిలో నష్టాలను కలుగజేసింది. మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 15 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అందుకుంది.

అయితే 4వ రోజు మాత్రం ఊహించని స్థాయిలో ఏపీ తెలంగాణలో కేవలం 25 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. దీంతో సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి వీకెండ్ వరకు మూడు కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ అందుకుంటూ వచ్చిన ఈ సినిమా 4వ రోజు వర్కింగ్ డే సోమవారం కావడంతో కలెక్షన్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమా 21.93 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. 33.30 కోట్ల గ్రాస్ వచ్చింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 1.65 కోట్లు, ఓవర్సీస్ లో 2.18 కోట్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా భోళా శంకర్ సినిమా నాలుగు రోజుల్లో 25.12 కోట్లు షేర్, 41.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 80 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ అందుకోవాలి. ఇక వచ్చిన నెంబర్స్ ను బట్టి చూస్తే ఇంకా 54 కోట్ల రేంజ్ లో వెనక్కి తీసుకు రావాల్సి ఉంది. కానీ సినిమా ఈ వారంలోనే ఫ్యాకప్ అయ్యేలా ఉంది అని అర్థమవుతుంది. దాదాపు 50 కోట్ల రేంజ్ లోనే నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News