ఈ వారం బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉంటుందో..

కాస్తా ఫేమ్ ఉన్న మూవీస్ వస్తే ఇంకా పోటీ తీవ్రంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

Update: 2024-02-06 03:40 GMT

ఒకేసారి ఎక్కువ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినపుడు కాంపిటేషన్ కూడా టఫ్ గానే ఉంటుంది. కాస్తా ఫేమ్ ఉన్న మూవీస్ వస్తే ఇంకా పోటీ తీవ్రంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. సంక్రాంతి రేసులో నాలుగు తెలుగు సినిమాలు రాగా ఎంత పోటీ ఏర్పడిందో అందరికి తెలిసిందే. ఆ పోటీలో హనుమాన్ స్ట్రాంగ్ గా నిలబడి భారీ సక్సెస్ ని అందుకుంది. ఈ సారి ఫిబ్రవరి రెండో వారంలో కూడా ఈ పోటీ గట్టిగానే ఉండబోతోంది.

ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం కథతో తెరకెక్కిన యాత్ర 2 మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ సపోర్టర్స్ నుంచి ఈ చిత్రానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించే అవకాశం ఉంది. మూవీలో తమిళ్ యాక్టర్ జీవా వైఎస్ జగన్ పాత్రలో కనిపిస్తున్నాడు.

ఫిబ్రవరి 9న మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈగల్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మరి భారీ అంచనాల మధ్య మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. చిత్ర యూనిట్ మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్. ఫిబ్రవరి 9న ఈ మూవీ తమిళ్, తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ కాబోతోంది. తమిళనాట సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏ మేరకు మూవీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాని ఫిబ్రవరి 7న థియేటర్స్ లో రీరిలీజ్ చేస్తున్నారు. రీరిలీజ్ ట్రెండ్ లో పవన్ కళ్యాణ్ చిత్రాలకి అద్భుతమైన ఆదరణ లభించింది. కెమెరామెన్ గంగతో రాంబాబు పొలిటికల్ టచ్ ఉన్న సినిమా. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ఏపీలో రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో కచ్చితంగా మూవీ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు తమిళ్ మూవీ లవర్ తెలుగు వెర్షన్ ట్రూ లవర్ ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతోంది.




 


Tags:    

Similar News