హిడింబ.. బాక్సాఫీస్ కలెక్షన్స్ గట్టిగానే..
గత కొద్ది వారాలుగా తెలుగు చిత్రసీమ బాక్సాఫీస్ వద్ద చిన్న, మీడియం రేంజ్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.
గత కొద్ది వారాలుగా తెలుగు చిత్రసీమ బాక్సాఫీస్ వద్ద చిన్న, మీడియం రేంజ్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వారం దాదాపు అరడజనుకు పైగా చిత్రాలు బాక్సాఫీస్ ముందుకు వచ్చాయి. వాటిలో 'హిడింబ' ఒకటి. నటుడు అశ్విన్‌బాబు హీరోగా నటించిన కొత్త చిత్రమిది. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించారు. నందితా శ్వేత ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించి ఆకట్టుకుంది.
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే మంచి టాక్‌తో ముందుకెళ్తోంది. మంచి వసూళ్లను కూడా అందుకుంటోంది. ఈ సినిమా విడుదలకు ముందే.. పెయిడ్ ప్రీమియర్స్ వేశారు మేకర్స్. అప్పుడే ఇది మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ చిత్రం రిలీజైన రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.3.36 కోట్లు గ్రాస్ అందుకుంది. ఇక శనివారం బాక్సాఫీస్ వద్ద రూ.2.33 కోట్ల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.
దీంతో 'హిడింబ' మొత్తం కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా రూ.5.69 కోట్లకు చేరుకున్నాయి. చిన్న బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే ఇంతటి మంచి వసూళ్లను అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలించింది. అయితే ఇదే సమయంలో గత వారం రిలీజైన 'బేబీ' ఇంకా సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది.
ఒకవేళ ఈ చిత్రం కనుక లేకపోయి ఉంటే.. 'హిడింబ' మరిన్ని వసూళ్లను అందుకునేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ అలా అశ్విన్ బాబు మూవీ టీమ్ లో మంచి జోష్ ను నింపుతోంది. ఇక జులై 23 ఆదివారం కాబట్టి.. మరిన్ని వసూళ్లు వస్తాయి. కాబట్టి.. వచ్చే వారం కూడా ఇదే జోరును కొనసాగిస్తే.. సినిమా మంచి లాభాల్ని అందుకున్నట్టే.
ఇకపోతే ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పణలో ఎస్వీకే సినిమాస్ పతాకంపై గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. హైదరాబాద్ నగరంలో అదృశ్యమవుతున్న మహిళల కేసును చేధించే స్పెషల్ ఆఫీసర్లుగా నందిత శ్వేత, అశ్విన్ బాబు అపాయింట్ అవుతారు. క్రిమినల్.. ఆడవారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, స్పెషల్ ఆఫీసర్లుగా వచ్చిన నందిత, అశ్విన్.. ఆ మహిళల కిడ్నాప్ మిస్టరీని ఎలా చేధించారనే నేపథ్యంలో థ్రిల్లర్ జోనర్ గా సినిమా రూపొందింది. అభిమానులను బాగా ఇంప్రెస్ చేస్తోంది.
ఇకపోతే ఈ చిత్రంలో అశ్విన్ బాబు, నందితా శ్వేతతో పాటు శ్రీనివాస రెడ్డి, సాహితీ అవంచ, సంజయ్ స్వరూప్, శిజ్జు, విద్యులేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, ప్రమోధిని, రఘు కుంచె, రాజీవ్ పిళ్లై, దీప్తి నల్లమోతు వంటి నటులు నటించారు. వికాస్ బాడిస.. సంగీతం, బి.రాజశేఖర్.. ఛాయాగ్రహణం అందించారు.