నార్త్ అమెరికాలో కల్కి ఊచకోత

ఓవరాల్ 5.5+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి మూవీ మొదటి రోజు అందుకుంది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లు అందుకోలేదు.

Update: 2024-06-28 05:21 GMT

యంగ్ రెబల్ స్టార్ మరోసారి కల్కి 2898ఏడీ సినిమాతో బాక్సాఫీస్ రారాజు అనిపించుకున్నారు. సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ ఫుల్ అయిపోయాయి. రెండు ట్రైలర్స్ తోనే సినిమా ఎలా ఉండబోతోందనేది నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి పరిచయం చేసేశారు.

దీంతో కల్కి చూడాలనే ఇంటరెస్ట్ అందరికి పెరిగింది. కల్కి 2898ఏడీ అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికాలో రెండు వారాల ముందుగానే స్టార్ట్ చేశారు. దీంతో మూవీ ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే చూడాలని అనుకునేవారు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. జూన్ 26న నార్త్ అమెరికాలో కల్కి మూవీ ప్రీమియర్ షోలు పడ్డాయి. వీటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రిలీజ్ తరువాత కూడా టికెట్ బుకింగ్స్ జోరుగా జరిగాయి.

కేవలం ప్రీమియర్స్ ద్వారానే కల్కి 2898ఏడీ మూవీ నార్త్ అమెరికాలో 3.9 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఇదే హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్. ఇక రిలీజ్ రోజైన గురువారం కూడా 1.5+ మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. ఓవరాల్ 5.5+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని కల్కి మూవీ మొదటి రోజు అందుకుంది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లు అందుకోలేదు.

నార్త్ అమెరికాలో కల్కి2898ఏడీ చిత్రాన్ని డిస్టిబ్యూట్ చేసిన ప్రత్యంగిర కలెక్షన్స్ డీటెయిల్స్ ని రివీల్ చేసింది. సినిమా భైరవ క్యారెక్టర్ లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ని ఈ కలెక్షన్స్ కి జత చేసి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. రికార్డ్స్ చూసుకో ఇంత వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు… ఇది కూడా ఓడిపోను అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ని కలెక్షన్స్ రిపోర్ట్ తో పాటు వైరల్ అవుతోంది.

కల్కి మూవీ వరల్డ్ వైడ్ గా ఓవరాల్ కలెక్షన్స్ 200+ కోట్లకి పైనే ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్ ని కల్కి బ్రేక్ చేసిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ బ్రేక్ చేస్తే మాత్రం కచ్చితంగా అది ట్రెండ్ సెట్టర్ అవుతుంది. మరల ప్రభాస్ దరిదాపుల్లోకి ఎవరు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News