'నా సామిరంగ' బాక్సాఫీస్.. 8వ రోజు కలెక్షన్స్ ఎంతంటే

విలేజ్ బ్యాక్ డ్రాప్ నేటివిటీతో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది

Update: 2024-01-22 05:04 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున కి సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. గత కొంతకాలంగా నాగ్ ప్రతి సంక్రాంతికి ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అలా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు వంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. ఈ సంక్రాంతికి నాగార్జున 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం జనవరి 14 న విడుదలై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఈసారి సంక్రాంతి సీజన్ లో హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ.. వంటి సినిమాలు పోటీ పడగా ఇందులో హనుమాన్ భారీ ప్రేక్షకాదరణతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆ తర్వాత స్థానంలో నాగార్జున 'నా సామిరంగ' ఉండడం విశేషం. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేటివిటీతో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో నా సామిరంగ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో మొదటి వారమే బ్రేక్ ఈవెన్ అందుకొని క్లీన్ హిట్టుగా నిలిచింది. సంక్రాంతికి ఎలాగైనా తన సినిమాని రిలీజ్ చేయాలని ఉద్దేశంతో నాగార్జున ఈ చిత్రాన్ని చాలా వేగవంతంగా పూర్తి చేశారు.

ఓ మలయాళ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక నిన్నటితో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తోంది. కాగా తాజాగా రెండో వారంలోకి ఎంటర్ అయిన ఈ చిత్రం ఎనిమిదో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.35 కోట్లు రాబట్టింది.

ఈ సినిమాకి ఎనిమిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే.

నైజాం - 26L

సీడెడ్ - 23L

వైజాగ్ - 28L

తూర్పు గోదావరి - 19L

పశ్చిమగోదావరి - 10L

కృష్ణ - 11L

గుంటూరు - 12L

నెల్లూరు - 6L

8వ రోజు (AP&TS) టోటల్ కలెక్షన్స్ - 1.35కోట్లు

8 రోజుల టోటల్ ఏపీ తెలంగాణ షేర్ - 21.89 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ - 44.8 కోట్లు

Tags:    

Similar News