బాలయ్య హ్యాట్రిక్​.. ఇది రూ.300కోట్ల లెక్క

ఈ లెక్కన చూస్తే.. నందమూరి బాలకృష్ణ వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ రూ.100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు అయింది.

Update: 2023-10-25 12:28 GMT

ఆరు పదుల వయసులోనూ అస్సలు అలిసిపోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు నందమూరి నట సింహాం బాలకృష్ణ. ఇప్పుడదే జోష్​లో వచ్చి 'భగవంత్ కేసరి'గా వచ్చి బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్నారు. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య ఓ సూపర్ హ్యాట్రిక్​ రికార్డ్​ను కూడా ఖాతాలో వేసుకున్నారు.

వివరాళ్లోకి వెళితే.. చాలా కాలం పాటు బాలకృష్ణ సరైన హిట్ లేక ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఆయన సినిమాలను నందమూరి అభిమానులు తప్ప ఇతర సినీ ప్రియులు చూసే వారు కూడా తక్కువయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్ల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ఆయన క్రేజ్​ను అమాంతం లేపింది. ఈ చిత్రం రూ. 100 కోట్లు పైగానే వసూలు చేసి.. బాలకృష్ణ కెరీర్​లోనే అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచింది.

ఈ సమయంలోనే బుల్లితెరపై కూడా అన్​స్టాపబుల్ అంటూ సెలబ్రిటీ టాక్​ షో ఆయన క్రేజ్​ వేరే లెవల్​కు వెళ్లిపోయింది. ఎక్కడ చూసిన జై బాలయ్య తప్ప మరో స్లోగన్ వినపడేది కాదు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి కూడా సంక్రాంతికి విడుదలై భారీ స్థాయిలో వసూలు చేసింది. దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది. అఖండను కూడా బీట్ చేసింది.

ఇక ఈ ఏడాది దసరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా కూడా బ్లాక్ బాస్టర్​ హిట్​గా నిలవడం మాత్రమే కాదు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్​ అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఈ లెక్కన చూస్తే.. నందమూరి బాలకృష్ణ వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ రూ.100 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు అయింది. మూడు చిత్రాల గ్రాస్ వసూళ్లు చెరో వంద కోట్లు దాటేశాయి. అంతే కాదు దసరాకి రిలీజ్ అయిన చిత్రాలన్నింటిలోనూ భగవంత్ కేసరే దసరా విన్నర్​గా నిలిచింది.

Tags:    

Similar News