పొలిమేర 2 వసూళ్ల బీభత్సం..!

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్, కామాక్షి, గెటప్ శ్రీను, బాలాదిత్య లీడ్ రోల్ లో వచ్చిన సినిమా పొలిమేర 2.

Update: 2023-11-05 17:20 GMT

అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్, కామాక్షి, గెటప్ శ్రీను, బాలాదిత్య లీడ్ రోల్ లో వచ్చిన సినిమా పొలిమేర 2. ఆల్రెడీ మా ఊరి పొలిమేర సినిమాతో హారర్ ఆడియన్స్ ని మెప్పించిన మేకర్స్ ఈసారి పొలిమేర 2 తో మరోసారి వాళ్లని భయపెట్టాలని వచ్చారు. పర్ఫెక్ట్ హర్రర్ థ్రిల్లర్ కి కావాల్సినవి అన్నీ పర్ఫెక్ట్ గా కుదరడంతో పొలిమేర 2 ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మంచి బజ్ ఏర్పడేలా చేశాయి.

ఈమధ్య కాలంలో మంచి కంటెంట్ తో డిఫరెంట్ అటెంప్ట్ తో వచ్చిన ఎలాంటి సినిమానైనా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన పొలిమేర 2 లాంటి సినిమాని కూడా ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల కన్నా రెండో రోజు వసూళ్లు అదిరిపోయాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమా రెండు రోజుల్లో 6.66 కోట్ల గ్రాస్ రాబట్టింది. సినిమాకు టాక్ బాగా రావడంతో రెండో రోజు నుంచి సినిమా చూసే ఆడియన్స్ సంఖ్య పెరుగుతుంది.

అందుకే మొదటి రోజు కన్నా సినిమా రెండో రోజు అధిక వసూళ్లు రాబట్టింది. శనివారం వరకు రెండు రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టిన పొలిమేర 2 సండే హాలిడే రోజు కాబట్టి ఈ ఫిగర్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. అదేంటో సినిమా చూసి ఎంత భయపడితే ఎంత ఎగ్జైట్ అయితే అంత బాగుందని అనుకుంటారు. పొలిమేర 2 విషయంలో అదే జరుగుతుంది. సినిమాలో ట్విస్ట్ లకు ఆడియన్స్ అంతా వావ్ అనేస్తున్నారు.

అందుకే సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. పొలిమేర 1 కన్నా పొలిమేర 2 కి ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ కి తగినట్టుగానే సినిమా ఉండటం వల్ల సినిమా వసూళ్ల పరంగా కూడా అదరగొట్టేస్తుంది. అనిల్ విశ్వనాథ్ పొలిమేర 2 తోనే కాదు ఇది ఫ్రాంచైజ్ గా కొనసాగించే అవకాశముంటుందని తెలుస్తుంది. పొలిమేర 2 సినిమా సక్సెస్ ఇలాంటి సినిమాలు మరెన్నో చేసేందుకు దారి చూపిస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఇయర్ మొదట్లో విరూపాక్ష సినిమా హర్రర్ థ్రిల్లర్ గా వచ్చి సూపర్ హిట్ అవ్వగా ఇప్పుడు పొలిమేర 2 కూడా అదే దారిలో వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.

Tags:    

Similar News