మే బాక్సాఫీస్.. ఎలా ఉండబోతోంది?

డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. వీటిలో ఏ మూవీని ఆడియన్స్ ఆదరించి హిట్ చేస్తారా అనేది చూడాలి.

Update: 2024-04-28 04:37 GMT

ఏప్రిల్ నెలలో టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలలో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. మొదటి వారంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మాత్రమే కాస్తా పెద్ద చిత్రం. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత వారంలో అంజలి లీడ్ రోల్ చేసిన గీతాంజలి మళ్ళీ వచ్చింది పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఈ రెండు తప్ప మిగిలినవన్నీ చిన్న చిత్రాలే కావడం విశేషం. వీటిలో ఏ మూవీ కూడా స్ట్రాంగ్ సౌండ్ క్రియేట్ చేయలేదు. తమిళ్ హీరో విశాల్ రత్నం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సక్సెస్ అందుకోలేదు.

ఈ నెలలో అయితే కాస్తా చెప్పుకోదగ్గ సినిమాలే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. మీడియం రేంజ్ హీరోల నుంచి వస్తోన్న ఈ సినిమాలపై పాజిటివ్ వైబ్ ఉండటం విశేషం. వీటిలో ముందుగా మే 3న అల్లరి నరేష్ నుంచి ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ చిత్రం వస్తోంది. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ చేస్తోన్న కామెడీ చిత్రం కావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఇదే డేట్ కి సుహాస్ ప్రసన్నవదనం మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కూడా ఇంటరెస్టింగ్ కంటెంట్ తో రాబోతోంది.

అలాగే విరించివర్మ దర్శకత్వం తెరకెక్కిన జితేందర్ రెడ్డి, వరలక్ష్మి శరత్ కుమార్ శబరి సినిమాలు మే3న రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏ మూవీ హిట్ అవుతుందనేది చూడాలి. తర్వాత మే10న విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. గోదావరి జిల్లాల నేపథ్యంలో ఫ్యాక్షనిజాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నారు. తాజాగా వచ్చిన టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. మే 10న కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ గా చేసిన సత్యభామ మూవీ కూడా రిలీజ్ కానుంది.

మే 25న దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి లవ్ మీ సినిమా రాబోతోంది. అశీష్, వైష్ణవి, చైతన్య ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తున్నారు. సినిమాని అయితే గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. మే31న సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న మాస్ మూవీ హరోం హర రిలీజ్ కాబోతోంది. పీరియాడిక్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఏప్రిల్ తో పోల్చుకుంటే మే నెలలో రిలీజ్ కాబోయే సినిమాలపై ఎంతో కొంత బజ్ ఉంది. అలాగే పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుంచి వస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. వీటిలో ఏ మూవీని ఆడియన్స్ ఆదరించి హిట్ చేస్తారా అనేది చూడాలి.

Tags:    

Similar News