ఓపెన్‌హైమర్ (Vs) బార్బీ.. ఏది బెస్ట్ మూవీ?
ఒకేసారి రెండు క్రేజీ సినిమాలు విడుదలైతే ఆ సన్నివేశం ఎప్పుడూ ఇబ్బందికరమే. వారం గ్యాప్ తో వచ్చినా థియేటర్లను అడ్జెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ టాలీవుడ్ అయినా సేమ్ టు సేమ్.
ఒకేసారి రెండు క్రేజీ సినిమాలు విడుదలైతే ఆ సన్నివేశం ఎప్పుడూ ఇబ్బందికరమే. వారం గ్యాప్ తో వచ్చినా థియేటర్లను అడ్జెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ టాలీవుడ్ అయినా సేమ్ టు సేమ్. ఇప్పుడు అలాంటి ఒక ఇబ్బందిని ఫేస్ చేస్తోంది ఓపెన్ హైమర్ చిత్రం. ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన `ఓపెన్‌హైమర్` ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్ పంట్, ఎమిలీ బ్లోర్న్, ఫ్లారెన్స్ లాంటి స్టార్లు నటించిన చిత్రమిది. అమెరికన్ సైంటిస్ట్.. అణుబాంబ్ పితామహుడు రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితకథతో ఇది తెరకెక్కింది. ఇన్సెప్షన్, డన్‌కిర్క్, ఇంటర్ స్టెల్లార్, టెనెట్ లాంటి క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించిన నోలన్ నుంచి సినిమా వస్తోంది అనగానే ఇటు భారతదేశంలోను విపరీతమైన క్యూరియాసిటీ కనిపించింది. దానికి తగ్గట్టే ఓపెన్ హైమర్ భారతదేశంలోను భారీ ఓపెనింగులు సాధించింది.
అయితే ఈ సినిమా రిలీజైన కొద్దిరోజులకే ఇప్పుడు మరో హాలీవుడ్ క్రేజీ సినిమా బార్బీ విడుదలైంది. అయితే ఇంచుమించు ఒకసారి రెండు క్రేజీ సినిమాల విడుదలతో థియేటర్లను షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇరు చిత్రాలకు ఆస్కార్ లు అందుకున్న క్రేజీ దర్శకులు పని చేసారు. బార్బీ చిత్రానికి అకాడమీ అవార్డు విజేత గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించారు. మార్గోట్ రాబీ -ర్యాన్ గోస్లింగ్ ఇందులో ప్రధానపాత్రల్లో నటించారు. ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైన జోనర్ లకు చెందినవి. ఓపెన్‌హైమర్ అనేది జపాన్‌లోని హిరోషిమా.. నాగసాకి నగరాల్ని ధ్వంసం చేసిన అణుబాంబ్ ను బాంబును సృష్టించిన భౌతిక శాస్త్రవేత్త J. రాబర్ట్ ఓపెన్‌హైమర్ కథను వర్ణించే గ్రిప్పింగ్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్. దీనికి విరుద్ధంగా `బార్బీ` అనేది ప్రియమైన బార్బీ ఫ్యాషన్ బొమ్మల ఆధారంగా రూపొందించబడిన ఫాంటసీ కామెడీ.
`ఓపెన్‌హైమర్` .. బార్బీ రెండూ అత్యంత భారీ బడ్జెట్లతో రూపొందినవే. ఓపెన్ హైమర్ బడ్జెట్ 100 మిలియన్ డాలర్లు (రూ. 821 కోట్లు)..182 నిమిషాల రన్ టైమ్‌ను కలిగి ఉంది. మరోవైపు `బార్బీ` 145 మిలియన్ డాలర్ల(రూ. 1190 కోట్లు) బడ్జెట్‌తో రూపొందింది. 114 నిమిషాల నిడివి ఉన్న చిత్రమిది.`ఓపెన్‌హైమర్` ఉత్తర అమెరికాలో 3600 స్క్రీన్‌లలో విడుదల కాగా.. అదే ప్రాంతంలో `బార్బీ` 4200 స్క్రీన్‌లలో విడుదలైంది.
ఓపెన్ హైమర్ బయోపిక్ కేటగిరీలో భారీ అంచనాలతో రిలీజ్ కాగా.. `బార్బీ` ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన అంచనాలతో విడుదలైంది. ఓపెన్‌హైమర్ భారతదేశంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశంలో క్రిస్టోఫర్ నోలన్ కి ఉన్న భారీ అభిమాన గణం `ఓపెన్‌హైమర్` అసాధారణమైన ఓపెనింగులకు సహకరించింది. విడుదల రోజున ఈ చిత్రం కోసం భారతీయ మల్టీప్లెక్స్‌లలో 90000 టిక్కెట్లు బుక్ అయినట్లు కథనాలొచ్చాయి. దీనిని మించి బార్బీ 160000 టిక్కెట్ బుకింగ్‌లను సాధించింది.
అమెరికాలో ప్రివ్యూల నుండి బార్బీ ఇప్పటివరకు చెప్పుకోదగిన 22.3 మిలియన్ డాలర్లను సంపాదించింది. ఓపెన్‌హైమర్ ప్రీమియర్‌ల నుండి 10.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. అయితే భారతదేశంలో ఓపెన్ హైమర్ - బార్బీ రెండు చిత్రాలకు సానుకూల స్పందనలు ఉన్నాయి.