యశ్ రాజ్ స్పై సినిమాలు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..

అందుకే వందల కోట్ల బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ కథలని సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ కంపెనీ తీస్తూ వస్తోంది.

Update: 2024-02-21 04:15 GMT

యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి గత కొన్నేళ్లుగా స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ కూడా ఆ కథలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వందల కోట్ల బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ కథలని సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ కంపెనీ తీస్తూ వస్తోంది. వారు నిర్మించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ కథలలో అత్యధిక కలెక్షన్స్ పఠాన్ మూవీకి వచ్చాయి.

షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా1060 కోట్లు కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లో గత ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూవీ ఇదే కావడం విశేషం. అలాగే బాలీవుడ్ లో నాలుగు సినిమాలు వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సాధిస్తే అందులో పఠాన్ ఒకటి. యశ్ రాజ్ లో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటే ట్ టైగర్ జిందా హై అని చెప్పాలి.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 565 కోట్ల గ్రాస్ అందుకుంది. మూడో స్థానంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వార్ మూవీ నిలిచింది. ఈ సినిమా 475 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. తరువాత నాలుగో స్థానంలో టైగర్ 3 మూవీ నిలవడం విశేషం. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్న కూడా ప్రపంచ వ్యాప్తంగా 465 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. దీనికి కారణం సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ కి ఉన్న గుర్తింపు అని చెప్పాలి.

తరువాత ఏక్ ది టైగర్ మూవీ 330 కోట్లు వసూళ్లు చేసింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఫైటర్ మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. నెక్స్ట్ యశ్ రాజ్ నుంచి వార్ 2 మూవీ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే షారుఖ్ ఖాన్ పఠాన్ సీక్వెల్ కూడా ఉంది.

ఈ రెండు సినిమాలకి ఉన్న క్రేజ్ కారణంగా కచ్చితంగా ఒక్కో మూవీ వెయ్యి కోట్లకి పైగానే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని బిటౌన్ లో వినిపిస్తోన్న టాక్. పఠాన్ 2 అయితే బాహుబలి 2 రికార్డులని కూడా బ్రేక్ చేయొచ్చని భావిస్తున్నారు. మరి ఎంత వరకు ఈ రెండు మూవీస్ అద్భుతాలు చేస్తాయనేది వేచి చూడాలి.

ఏక్ ది టైగర్ - 330CR

టైగర్ జిందా హై - 565CR

వార్ - 475CR

పఠాన్ - 1060CR

టైగర్ - 465CR

Tags:    

Similar News