గత వారం అరడజను.. ఈ వారం డజను!
11 తెలుగు సినిమా లు కాగా ఒకటి రీ రిలీజ్ డబ్బింగ్ మూవీ. మొత్తంగా పన్నెండు సినిమాలు ఈ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాం అంటూ విడుదలకు సిద్ధం అయ్యాయి.
తెలుగు బాక్సాఫీస్ వద్దకు వచ్చే వారం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మరియు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా దసరా సందర్భంగా బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ఆ రెండు సినిమాలతో పాటు లియో ను కూడా తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
దసరా నేపథ్యం లో గత వారం మరియు ఈ వారం పెద్ద సినిమాలు.. క్రేజీ సినిమాలు ఏవీ కూడా బాక్సాఫీస్ వద్దకు రాలేదు.. రావడం లేదు. గత వారం చిన్నా చితక సినిమాలు ఏకంగా ఆరు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఏ ఒక్కటి కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. ఇక ఈ వారం డబుల్ అన్నట్లుగా సినిమాలు రాబోతున్నాయి.
గత వారం అర డజను సినిమాలు వస్తే... ఈ వారం ఏకంగా డజను సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 11 తెలుగు సినిమా లు కాగా ఒకటి రీ రిలీజ్ డబ్బింగ్ మూవీ. మొత్తంగా పన్నెండు సినిమాలు ఈ వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతాం అంటూ విడుదలకు సిద్ధం అయ్యాయి.
చివరి నిమిషంలో ఆ పన్నెండు సినిమాల్లో ఏమైనా వెనక్కి తగ్గుతాయో తెలియదు కానీ ఇప్పటి వరకు పన్నెండు సినిమాలు కూడా విడుదలకు ముస్తాబు అవుతున్నాయి. ఈ పన్నెండు సినిమాల్లో ఏ ఒక్కటి కూడా పెద్దగా బజ్ ను క్రియేట్ చేయలేక పోయాయి. కనుక ప్రేక్షకులు దసరా వరకు సినిమాల కోసం వెయిట్ చేయాల్సిందే అనే టాక్ వినిపిస్తుంది.
ఈ వారం విడుదల అవ్వబోతున్న సినిమాలు ఏంటంటే... మిస్టరీ, గుణ సుందరి కథ, రాక్షస కావ్యం, సగిలేటి కథ, తంతిరం, పెళ్లెప్పుడు, మధురపూడి గ్రామం అనే నేను, ఒక్కడే వన్, నీలోనే నేను, మా ఊరి సిన్మా, గాడ్, రతి నిర్వేదం సినిమాలు ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
కొత్త సినిమాలతో పోల్చితే పాత సినిమా రతి నిర్వేదం కే కాస్త ఎక్కువ బజ్ ఉన్నట్లు అనిపిస్తుంది. మరి వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. దసరా సెలవులు మొదలు అయ్యాయి కనుక ఏ సినిమా అయినా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంటే కచ్చితంగా నైజాం లో బాక్సాఫీస్ సందడి ఖాయం.