బాక్సాఫీస్ తలరాత మార్చబోతున్న 2024
అయితే ఈ ఏడాది మాత్రం తెలుగు సినిమా ఇండస్టీకి పెద్దగా కలిసి రాలేదు. అలాగే చెప్పుకోదగ్గ పాన్ ఇండియా మూవీస్ కూడా ఇప్పటి వరకు రాలేదు.
2020 తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన ఆధిపత్యం చూపిస్తూ వస్తోంది. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో ఎంటర్టైన్మెంట్ మార్కెట్ లో టాప్ చైర్ లోకి వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం తెలుగు సినిమా ఇండస్టీకి పెద్దగా కలిసి రాలేదు. అలాగే చెప్పుకోదగ్గ పాన్ ఇండియా మూవీస్ కూడా ఇప్పటి వరకు రాలేదు.
ఒక్క సలార్ మూవీ మాత్రమే డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా బ్రాండ్ తో తెరకెక్కిన కూడా 200 కోట్లకి పైగా బడ్జెట్ తో ఉన్నవి లేవని చెప్పాలి. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా ఒక్క వాల్తేర్ వీరయ్య తప్ప ఏ ఒక్క సినిమా రెండు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించలేకపోయింది.
సలార్ అయితే కచ్చితంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మాత్రం మరల టాలీవుడ్ టాప్ చైర్ లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినిమాల లైన్ అప్ చూస్తుంటే తెలుస్తోంది. జనవరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై 300 కోట్లకి పైగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
నెక్స్ట్ ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. దీనిపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. తరువాత డార్లింగ్ ప్రభాస్ కల్కి ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా పైన బిజినెస్ 500 కోట్లకి పైగా జరిగే ఛాన్స్ ఉంది. అలాగే బాహుబలి 2 రికార్డ్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పవర్ కళ్యాణ్ OG భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. కంటెంట్ క్లిక్కయితే పవన్ 200 కోట్ల మార్క్ చూడగలడు.
అలాగే మెగా 156 కూడా వచ్చే ఏడాది ఆఖరులో ప్రేక్షకులని పలకరించే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 ది రూల్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్, సలార్ 2 సినిమాలు కూడా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు 250 కోట్ల నుంచి 500 కోట్ల వరకు బిజినెస్ చేయగలవు. ఈ సినిమాలలో కనీసం ఐదు హిట్ అయిన కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ టాప్ లో నిలబడటం ఖాయం అనే మాట వినిపిస్తోంది.