2024 సంక్రాంతితో భలే చిక్కొచ్చిందే!
తనని తప్పుగా అనుకున్నా పర్వాలేదని...ఎవరూ నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే తన నిర్ణయాన్ని ఓపెన్ గా చెప్పారు. అయితే దీనిపై ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది చూడాలి.
సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అయితే నష్టాలొస్తాయని తెలిసినా? ఇంతవరకూ ఎవరూ వెనక్కి తగ్గింది లేదు. దీనికి సంబంధించిన అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా తన అభిప్రాయాన్ని ఓపెన్ గానే చెప్పారు. తనని తప్పుగా అనుకున్నా పర్వాలేదని...ఎవరూ నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోనే తన నిర్ణయాన్ని ఓపెన్ గా చెప్పారు. అయితే దీనిపై ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది చూడాలి.
పక్కాగా మహేష్ నటించిన 'గుంటూరు కారం' అయితే రిలీజ్ అవుతుందని రాజుగారు తెగేసి చెప్పేసారు. అలాగే తన సినిమా మార్చికి వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీంతో మిగతా నలుగురు డిసైడ్ అవ్వాల్సి ఉందని తెలుస్తోంది. ఒకవేళ అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? థియేటర్ల సమస్య ఎలా ఉంటుంది? టాక్ ని రన్నింగ్ ఎలా ఉంటుందన్న అంశాలు సైతం ట్రైడ్ అంచనా వేసి చెబుతుంది. ఈ నేపథ్యంలో నిపుణులు ఓ పాత ఉదాహరణని గుర్తు చేస్తున్నారు.
అప్పట్లో ఓ ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎలాంటి పరిస్థితి నెలకుందో గుర్తు చేస్తున్నారు. ఓసారి ఆ మ్యాటర్ లోకి వెళ్తే... 2001లో సంక్రాంతి సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మృగరాజు'.. నటసింహ బాలకృష్ణ నటించిన 'నరసింహ నాయుడు', విక్టరీ వెంకటేష్ నటించిన 'దేవి పుత్రుడు' మూడు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద వార్ నడించింది. అది అభిమానుల వైరానికి సైతం తెర తీసింది అప్పట్లో.
'మృగరాజు'(జనవరి11) చిత్రానికి తొలి ఆటతోనే ప్రతికూల సన్నివేశం ఎదురైంది. సినిమా బాగోలేదు అన్న టాక్ బయటకు వచ్చేసింది. దీంతో ఆ సినిమాని రెండు రోజులు థియేటర్లో ఆడించి మూడవ రోజు తొలగించారు. ఆ థియేటర్లన్నింటిని 'నరసింహనాయుడు'..'దేవి పుత్రుడు' సినిమాలతో ఫిల్ చేసారు. అప్పటికే అవి పాజిటివ్ టాక్ రావడంతో ఆ రెండు సినిమాలకు థియేటర్లు సర్దుబాటు జరిగింది. అయితే ఈ రెండు సినిమాల మధ్య కూడా గట్టిపోటీ ఎదురైంది. ఎక్కువ థియేటర్లు నరసింహనాయుడు చిత్రానికి కేటాయించడంతో? అది పెద్ద వైరంగా మారింది. చివరికి ఎలాగూ ఆ వివాదం కామ్ అప్ అయింది.
అదే సీజన్ లో మహేష్ నటించిన 'మురారీ' కూడా రిలీజ్ కి రెడీ అయింది. కానీ అగ్ర హీరోల సినిమాల స్పీడ్ చూసి మహేష్ వెనక్కి తగ్గాడు అప్పట్లో. ఆ చిత్రాన్ని ఫిబ్రవరి మూడవ వారంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా పోటీగా సినిమాలు లేకపోవ డంతో? అది బ్లాక్ బస్టర్ అయింది. మహేష్ కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఆ రకంగా పోటా పోటీగా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది? పోటీ లేకుండా సరైన తేదీ చూసుకుని రిలీజ్ చేసుకుంటే? ఎలా ఉంటుంది అనడానికి ఈ నాలుగు చిత్రాల్ని చెప్పొచ్చు. ఏది ఏమైనా సంక్రాంతి వార్ నేపథ్యంలో అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది.