రెండు రోజుల గ్యాప్ లో 6 సినిమాలు.. బిగ్ క్లాష్

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా ట్రెండ్ లో ఒకే భాషకి పరిమితం కాకుండా ఇండియన్ స్టార్స్ గా హీరోలు ఎదగాలని అనుకుంటున్నారు.

Update: 2023-08-19 04:15 GMT

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా ట్రెండ్ లో ఒకే భాషకి పరిమితం కాకుండా ఇండియన్ స్టార్స్ గా హీరోలు ఎదగాలని అనుకుంటున్నారు. అలాగే దర్శకులు కూడా యూనివర్శల్ కథలని తీసుకొని వీలైనన్ని ఎక్కువ భాషలలో మూవీస్ రిలీజ్ చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ప్రేక్షకాదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆడియన్స్ కూడా అన్ని ప్రాంతాలకి చెందిన సినిమాలని చూస్తున్నారు. వారి టేస్ట్ పూర్తిగా మారిపోయింది.

కంటెంట్ లో దమ్ముంటే అందులో యాక్టర్స్ ఎవరనేది చూడకుండా సూపర్ హిట్ చేస్తున్నారు. అందుకే సినిమాల పోటీ ఎక్కువైంది. ఒకే రోజు నాలుగు, ఐదు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీలో చిన్న సినిమాలకి స్కోప్ తక్కువ ఉన్న కాస్తా ఫేమ్ ఉన్న హీరోలకి మాత్రం ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. అలాగే అక్టోబర్ లో రెండు రోజుల గ్యాప్ లో ఏకంగా ఆరు సినిమాలు దసరా కానుకగా రిలీజ్ అవుతూ ఉండటం విశేషం.

బాలయ్య భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది. దీనికి పోటీగా అదే రోజు ఇళయదళపతి విజయ్ లియో మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే అదే రోజు థియేటర్స్ లోకి వస్తోంది. లియో సినిమాపై తెలుగులో కూడా భారీ హైప్ ఉంది. భగవంత్ కేసరికి ఈ సినిమా గట్టి పోటీ అని చెప్పొచ్చు.

అక్టోబర్ 20న మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న బయోపిక్ మూవీ టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. అదే రోజు కన్నడ నుంచి రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన సప్తసాగర దాచి ఎల్లో మూవీ రిలీజ్ కాబోతోంది. తెలుగులో కూడా ఈ మూవీ ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతోంది.

హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన గణపత్ మూవీ అక్టోబర్ 20న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం కూడా తెలుగులో డబ్ అయ్యి వస్తోంది. ఇలా రెండు రోజుల గ్యాప్ లో ఏకంగా ఆరు సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతూ ఉండగా అందులో రెండు మాత్రమే స్ట్రైట్ తెలుగు సినిమాలు. మిగిలినవి డబ్బింగ్ మూవీస్ గా వస్తున్నాయి. వీటిలో లియోపై హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

Tags:    

Similar News