75 రోజులలో చేసారు అంటే చాల పెద్ద విషయం
ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకంగా ఎయిర్ పోర్స్ లో ట్రైనింగ్ తీసుకుని మరీ సన్నదం అయ్యాడు. పవర్ పుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తోన్న 'ఆపరేషన్ వాలంటైన్' గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగా ప్రిన్స్ చేస్తోన్న మరో భారీ సాహసం ఇది. ఎయిర్ పోర్స్ నేపథ్యంలో పుల్వామా ఎటాక్స్ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బజ్ ని తీసుకొచ్చాయి.
ఈ సినిమా కోసం వరుణ్ ప్రత్యేకంగా ఎయిర్ పోర్స్ లో ట్రైనింగ్ తీసుకుని మరీ సన్నదం అయ్యాడు. పవర్ పుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. వరుణ్ లుక్ ..క్యారెక్టరైజేషన్ ప్రతీది హైలైట్ చేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంటె లో సైతం మెగాస్టార్ చిరంజీవి బూస్టింగ్ తో వరుణ్ మరింత బలంగా జనాల్లోకి వెళ్తు న్నాడు. మెగా క్యాంప్ లోనే ప్రత్యేకమైన హీరోగా హైలైట్ అవుతున్నాడు. సాధారణంగా ఇలాంటి సినిమాల షూటింగ్ పూర్తి చేయడం అన్నది అంత సులభం కాదు.
కొన్ని నెలలు పాటు శ్రమిస్తే తప్ప సాధ్యంకానిది. నటీనటులందరిపై ప్రత్యేకగా దృష్టి పెడితే తప్ప పర్పెక్ష న్ రాదు. అందుకోసం చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. అందుకోసమే హీరోల కాల్షీట్లు కూడా ఎక్కువగానే కేటాయించాల్సి వస్తుంది. అవసరం మేర రీషూట్లు కూడా చేస్తుంటారు. అయితే ఆపరేషన్ వాలంటైన్ మాత్రం కేవలం 75 రోజుల్లోనే పూర్తి చేసినట్లు తెలిపారు. అంటే ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేసినట్లు లెక్క.
ఇలాంటి సినిమాలకు కనీసం ఆరు నెలలైనా షూటింగ్ కే సమయం పడుతుంది. కానీ శక్తి ప్రతాప్ సింగ్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. బడ్జెట్ లోనే షూట్ అంతా వేగంగా పూర్తిచేసినట్ల తెలుస్తోంది. ఇలాంటి సినిమాలు బడ్జెట్ లో పూర్తి చేయడం కూడా చిన్న విషయం కాదు. ఎంతో ప్లానింగ్ ఉంటో తప్ప పనికాదు. ఈ విషయంలో శక్తి ప్రతాప్ సింగ్ ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి వ్యూహాన్నే అనుసరించి ముందుకెళ్తినట్లు తెలుస్తోంది. 75 రోజుల షూట్ అనంతరం గ్రాఫిక్స్ సహా ఇతర పనులకే ఎక్కువ సమయం పట్టినట్లు తెలుస్తోంది.