ఆయ్ బాక్సాఫీస్.. పండగరోజు కూడా అదిరింది!

గీతా ఆర్ట్స్ 2లో బన్నీ వాస్ నిర్మాత తెరకెక్కిన ఆయ్ మూవీ ఫుల్ పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతోంది.

Update: 2024-08-20 09:59 GMT

గీతా ఆర్ట్స్ 2లో బన్నీ వాస్ నిర్మాత తెరకెక్కిన ఆయ్ మూవీ ఫుల్ పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతోంది. నార్నే నితిన్ హీరోగా అంజిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులని కట్టిపడేసే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. చాలా రోజుల తర్వాత హాయిగా ఆహ్లాదకరమైన వినోదాన్ని ఆశ్వాదిస్తున్నామనే మాట పబ్లిక్ నుంచి వస్తోంది.


డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలకి నెగిటివ్ టాక్ రావడంతో ఆయ్ సినిమాకి భాగా కలిసొచ్చింది. ఈ వీకెండ్ సెలవులలో ఫ్యామిలీ అంతా కలిసి ఆయ్ సినిమాని చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆయ్ సినిమాకి దీంతో ఐదో రోజు కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వచ్చాయి. మొదటి రోజు కంటే రెట్టింపు కలెక్షన్స్ ఐదో రోజు ఆయ్ సినిమాకి రావడం విశేషం.

రాఖీ పౌర్ణమి ఫెస్టివల్ కలిసి రావడంతో సినిమా అన్ని సెంటర్స్ లో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఆయ్ మూవీ సోమవారం 1.2 కోట్ల కలెక్షన్స్ ని అందుకుందని చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. సక్సెస్ ఫుల్ గా ఆయ్ మూవీ థియేటర్స్ లో కొనసాగుతోందని పోస్టర్ లోపేర్కొన్నారు.. ఫెస్టివల్ ని ఆయ్ సినిమా చూస్తూ థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకున్నారని ఈ కలెక్షన్స్ చూసి ట్రెండ్ పండితులు కూడా అంటున్నారు.

వీకెండ్, ఫెస్టివల్ హాలిడే అయ్యాక మంగళవారం నుంచి కూడా ఆయ్ సినిమాకి నిలకడగా కలెక్షన్స్ వస్తే మాత్రం సినిమా భారీ లాభాలు అందుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. బన్నీ వాస్ మరో సూపర్ సక్సెస్ ని ఆయ్ తో తన ఖాతాలో వేసుకున్నారనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. మ్యాడ్ లాంటి సూపర్ హిట్ తర్వాత నార్నే నితిన్ కి కూడా ఆయ్ మూవీ కమర్షియల్ బ్రేక్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం థియేటర్స్ లో ఆయ్ కి పోటీగా చియాన్ విక్రమ్ తంగలాన్ మూవీ ఉంది. అయితే ప్రేక్షకాదరణ పరంగా చూసుకుంటే ఆయ్ టాప్ లో ఉంది. ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అంజిబాబుకి కూడా మూవీ మంచి పేరు తీసుకొచ్చేలా ఉందనే మాట వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఆగష్టు 15కి టాలీవుడ్ నుంచి బాక్సాఫీస్ విన్నర్ గా ఆయ్ మూవీ నిలిచిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News