అభిషేక్ బచ్చన్.. సౌత్ లో లక్కీ ఛాన్స్!

ఇదిలా ఉంటే ప్రస్తుతం బి హ్యాపీ అనే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది.

Update: 2024-05-24 23:30 GMT

బాలీవుడ్ లో బిగ్ బి తనయుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు అభిషేక్ బచ్చన్. హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాకపోయిన నటుడిగా మాత్రం అభిషేక్ బచ్చన్ తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. సక్సెస్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. రిఫ్యూజ్ మూవీతో 2000లో అభిషేక్ బచ్చన్ హీరోగా తెరంగేట్రం చేశాడు.

అప్పటి నుంచి రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది గూమర్ మూవీతో అభిషేక్ బచ్చన్ చివరిగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో కోచ్ పాత్రలో కనిపించాడు. ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బి హ్యాపీ అనే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతోంది. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో ఒక మూవీ అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు.

పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత బాలీవుడ్ యాక్టర్స్ అందరూ సౌత్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్, అమితాబచ్చన్, బాబీ డియోల్ లాంటి స్టార్స్ సౌత్ లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా ఈ లైన్ లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ రాజా దర్శకత్వంలో జయం రవి హీరోగా తని ఒరువన్ మూవీ తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ గా నటించాడు.

ఈ చిత్రంలో తెలుగులో ధృవగా రీమేక్ అయ్యింది. రామ్ చరణ్ హీరోగా నటించగా అరవింద్ స్వామి నెగిటివ్ రోల్ చేశారు. దీనికి సీక్వెల్ చేయాలని మోహన్ రాజా చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. జయం రవి క్యారెక్టర్ ని కొనసాగిస్తూ మరో కొత్త విలన్ ని పరిచయం చేయబోతున్నాడంట. ఈ సారి విలన్ పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ ని రంగంలోకి దించుతున్నాడని తెలుస్తోంది. కథ నచ్చడంతో అభిషేక్ బచ్చన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.

ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు హిందీ భాషలలో కూడా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తో ధృవ సీక్వెల్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే మోహన్ రాజా రెండు భాషలలో ఇద్దరు హీరోలని పెడతాడా లేదంటే జయం రవి హీరోగా అభిషేక్ బచ్చన్ విలన్ గా పాన్ ఇండియా రేంజ్ లో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.


Full View


Tags:    

Similar News