దేవరలో ఇద్దరి వేట!

కచ్చితంగా యాక్షన్ ఘట్టాలు, సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ ప్రేక్షకులకి గూస్ బాంబ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Update: 2024-08-18 04:35 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సిద్ధమవుతోన్న దేవర మూవీ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి రానుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా ఈ మూవీని కొరటాల శివ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన పోర్షన్ కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన షూట్ కూడా ఈ నెల ఆఖరుకి కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందనేది ఇప్పటికే చిత్ర యూనిట్ పోస్టర్స్, గ్లింప్స్ తో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వీటితో సినిమాపైన ఎక్స్ పెక్టేషన్స్ కూడా పెరిగాయి. కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ దేవర అవుతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. కళ్యాణ్ రామ్ కూడా దేవర సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇందులో అతని పాత్ర చాలా వైలెంట్ గా ఉండబోతోందని అర్ధమవుతోంది. బందిపోటు దొంగల నాయకుడిగా అతని పాత్ర కనిపిస్తోంది. ఎలాంటి వాడినైనా క్షణాల్లో చంపేసేంత బలశాలిగా సైఫ్ అలీఖాన్ ని చూపించారు. అలాంటి వాడితో దేవర తలపడతాడు. దీనిని బట్టి ఇద్దరి మధ్య పోరు ఏ రేంజ్ లో ఉండబోతోందనేది అంచనా వేసుకోవచ్చు. కచ్చితంగా యాక్షన్ ఘట్టాలు, సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ ప్రేక్షకులకి గూస్ బాంబ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సైఫ్ అలీఖాన్ భైరా క్యారెక్టర్ లో దేవర చిత్రంలో కనిపిస్తున్నాడు. అతని హంటింగ్ గ్లింప్స్ లో పెద్దగా హైలెట్ చేయకపోయినా సినిమాలో మాత్రం చాలా భయంకరంగా ఉంటుందట. వీరిద్దరి వేట, ఆటని చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిరుద్ రవిచందర్ బ్యాగ్రౌండ్ ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సాంగ్స్ తో కూడా అనిరుద్ మెప్పించాడు. దేవర నుంచి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్ కూడా కంప్లీట్ అయ్యింది. డిస్టిబ్యూటర్స్ దేవర సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరల ప్రేక్షకులని పెద్ద సంఖ్యలో దేవర మూవీ థియేటర్స్ వైపు రప్పిస్తుందని భావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ యాక్షన్ వేట ఎలా ఉండబోతోందనేది చూడాలనే సెప్టెంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News