నటుడి బ్యాంక్ ఖాతాను కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు
డిజిటల్ ప్రపంచంలో ఊహించని రీతిలో షాకిచ్చిన ఈ ఘటనలో తన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయింద.
ప్రఖ్యాత డ్యాన్సర్ కం నటుడు ఇటీవల తన అభిమానులతో ఒక షాకింగ్ సంఘటన గురించి చెప్పి వాపోయారు. అతడు ఆన్ లైన్ మోసగాళ్ల పథకానికి బాధితుడిగా మారినట్లు వెల్లడించారు. డిజిటల్ ప్రపంచంలో ఊహించని రీతిలో షాకిచ్చిన ఈ ఘటనలో తన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయింద. ఇది బ్యాంకింగ్ ఫ్రాడ్. సోషల్ మీడియాల్లో సదరు నటుడు ఈ మోసం గురించి వివరించాడు. తనను అనుసరిస్తున్న లక్షలాది మంది అనుచరులకు ఇది హెచ్చరికగా మారింది.
తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతాలో కార్డు క్రియేట్ అయ్యిందని అతడు తన పోస్ట్‌లో వెల్లడించాడు. మరింత దిగజారిన విషయం ఏమంటే... అతడి రిజిస్టర్డ్ ఇమెయిల్ ID, ఫోన్ నంబర్, చిరునామా కూడా అతడికి తెలియకుండానే మార్చేసారు. తన అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అతడు సోషల్ మీడియాలో కలతకు గురయ్యాడు.
నేను దీనిని నమ్మలేకపోతున్నాను.. నా బ్యాంక్ ఖాతా మోసానికి గురైంది.. నాకు తెలియకుండా సృష్టించిన కార్డ్ చూసి షాకయ్యాను. నాకు OTP కూడా రాలేదు. నా రిజిస్టర్డ్ ఇమెయిల్ .. ఫోన్ నంబర్ ఎటువంటి ధృవీకరణ లేకుండా మార్చేసారు. అయితే బ్యాంకింగ్ అధికారులు స్పందించి, శీఘ్ర చర్య తీసుకోవడం నిజంగా అభినందనీయం. భద్రతను పునరుద్ధరించండి.. ఈ అశాంతికరమైన పరిస్థితిని పరిష్కరించండి`` అని అన్నారు. డిజిటల్ రంగంలో మెరుగైన భద్రతా చర్యల ఆవశ్యకతను నొక్కిచెబుతూ, వారి వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడంలో వ్యక్తులు ఎదుర్కొంటున్న పెరుగుతున్న సవాళ్లను ఈ సంఘటన హైలైట్ చేసింది.
సదరు నటుడు సినీపరిశ్రమలో ప్రముఖ వ్యక్తి, ఫిక్షన్ షోలు, రియాలిటీ టీవీ, వెబ్ షోలు, మ్యూజిక్ వీడియోలతో పాపులరయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన డ్యాన్స్ రియాలిటీ షోలు, పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో అతడి ప్రయాణం ఈ రోజు ఉన్నత స్థితికి చేరుకునేందుకు సహకరించింది. ఎదిగినా కానీ ఇప్పుడు ప్రమాదాలకు ఎవరూ అతీతులు కారు. ఈ దురదృష్టకర సంఘటన సుప్రసిద్ధ వ్యక్తులు కూడా ఆన్ లైన్ మోసాలు, సైబర్ బెదిరింపుల నుండి తప్పించుకోలేరని గుర్తుచేస్తుంది. పెరుగుతున్న పరస్పర అనుసంధానం డిజిటలైజ్డ్ ప్రపంచంలో వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవడానికి అప్రమత్తంగా ఉండటం.. పటిష్టమైన భద్రతా చర్యలను అమలు చేయడం ప్రాముఖ్యతను ఈ సంఘటన నొక్కి చెబుతుంది.
ఇంతకీ ఎవరా నటుడు? అంటే.. ఆలియా సరసన గంగూభాయి కథియావాడీ చిత్రంలో నటించిన శంతను గురించే ఇదంతా. అమాయకంగా కనిపించే అతడికి ఇప్పుడు ఇలాంటి సవాల్ ఎదురైంది. కానీ అతడు వెంటనే దాని నుంచి కోలుకోగలిగాడు. అయినా ఇలాంటి ప్రమాదాలు నిత్యం చూస్తున్నవే. ఇతరులు తమ డిజిటల్ ఐడెంటిటీలను భద్రపరచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, ఒక విలువైన పాఠంగా ఇది ఉపయోగపడుతుంది.