బుల్లి తెర న‌టి సూప‌ర్ హాట్ ట్రీట్!

బుల్లి తెర భామ‌లు కూడా హీరోయిన్ల‌కు ఏమాత్రం త‌క్కువ కాదు. అవ‌కాశం రాక బుల్లి తెర‌పై ఉండాల్సి వ‌చ్చింది

Update: 2023-11-22 00:30 GMT

బుల్లి తెర భామ‌లు కూడా హీరోయిన్ల‌కు ఏమాత్రం త‌క్కువ కాదు. అవ‌కాశం రాక బుల్లి తెర‌పై ఉండాల్సి వ‌చ్చింది. లేకుంటే? వెండి తెర‌పై అంత‌కు మించిన గ్లామ‌ర్ ట్రీట్ తో అల‌రించే భామ‌లెంతో మంది ఉన్నారు. బుల్లి తెర‌పై గ్లామ‌ర్ కి ఆస్కారం లేదు కాబ‌ట్టి చాలా మంది భామలు ఆఫ్ ది స్క్రీన్ లోనూ అంతే ట్రెడీష‌న‌ల్ గా క‌నిపిస్తుంటారు. ఆ ఫ్ ది స్క్రీన్ లోనూ బోల్డ్ బ్యూటీలుగా ఫేమ‌స్ అయితే ఆ ప్ర‌భావం సీరియ‌ల్స్ అవ‌కాశాల‌పై ప‌డుతుంది.


కానీ ఈ న‌టి మాత్రం అవేం ప‌ట్టించుకోకుండానే గ్లామ‌ర్ ఎలివేష‌న్ లో స‌త్తా చాటింది. 'గుప్పెడంత మన‌సు' సీరియ‌ల్ న‌టి జ్యోతిరాయ్ సుప‌రిచితులే. సీరియ‌ల్స్ లో వ‌య‌సు ముదురిన పాత్ర‌లు పోషిస్తుంటుంది. అమ్మ‌..అక్క‌.వ‌దిన అంటూ డీసెంట్ పాత్ర‌ల్లో క‌నిపిస్తుంటుంది. కానీ సొగ‌స‌రి ఆఫ్ ది స్క్రీన్ మాత్రం ఆ రోల్స్ కి భిన్నంగా గ్లామ‌ర్ ట్రీట్ తో అల‌రిస్తుంది. క‌న్న‌డ బోల్డ్ అటెంప్ట్ చూసి అంతా స్ట‌న్ అవుతున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే జ్యోతిరాయ్' ప్రెట్టి గ‌ర్ల్' అనే వెబ్ సిరీస్ లో న‌టిస్తోంది. అలాగే 'మాస్ట‌ర్ పీస్' అనే సినిమాలోనూ న‌టిస్తోంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడితో అమ్మ‌డు డీప్ లవ్ లో ఉన్న‌ట్లు క‌థ‌నాలు వెడెక్కిస్తు న్నాయి. తాజాగా అమ్మ‌డు ఇన్ స్టాని షేక్ చేసే కొన్ని స్టిల్స్ లో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా స్కిన్ టైట్ ఫిట్ దుస్తుల్లో అందాల వ‌డ్డ‌న‌తో విందు ఇచ్చింది.

నాభి అందాల్ని హైలైట్ చేస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది. భారీగా మ్యాక‌ప్ తో అమ్మ‌డు వ‌య‌సును పూర్తిగా దాచేసింది. ఈమె సీరియ‌ల్స్ చేసే జ్యోతిరాయ్ నా? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు . ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. జ్యోతి ఫాలోవ‌ర్లు త‌నివి తీరా చూసి త‌రిస్తున్నారు. ఇలాంటి పిక్స్ మోర్ అండ్ మోర్ కావాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News