మా నాన్న ట్రాక్టర్ బెల్టులతో బాదేవాడు!
తాజాగా తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. చిన్నప్పుడు శివాజీ తండ్రి ట్రాక్టర్ బెల్ట్ తో కొట్టేవారుట. వేసుకునే బెల్ట్ అయితే దెబ్బ సరిగ్గా తగలదని ట్రాక్టర్ బెల్డ్ ఆయుధంగా వాడేవారుట.
నటుడు శివాజీ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించిన నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. ఇండస్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడిన నటుడు శివాజీ. సినిమాల్లో సక్సెస్ అయిన నటుడు అటుపై రాజకీయాల్లోనూ స్పోక్ పర్సన్ గా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ క్రమంలోనే సినిమాలకు గ్యాప్ కూడా ఏర్పడింది. ఇదే వేడిలో ఏదైనా పార్టీ తరుపున పోటీ చేస్తాడా? అన్నంత ప్రచారం సాగింది గానీ అంతవరకూ వెళ్లలేదు.
ఇటీవలే #90 స్ బయోపిక్ తో మళ్లీ నటుడిగా కంబ్యాక్ అయ్యాడు. తనకు నటించడం ఇష్టం లేకపోయిన తన పిల్లలు కోరడంతో మ్యాకప్ వేసుకున్నట్లు ఇప్పటికే రివీల్ చేసాడు. అయితే సాధారణ మధ్య తరగతి కుటంబం నుంచి వచ్చిన శివాజీ కి కూడా తండ్రి అంటే టెర్రర్ అనే తెలుస్తోంది. తాజాగా తన తండ్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. చిన్నప్పుడు శివాజీ తండ్రి ట్రాక్టర్ బెల్ట్ తో కొట్టేవారుట. వేసుకునే బెల్ట్ అయితే దెబ్బ సరిగ్గా తగలదని ట్రాక్టర్ బెల్డ్ ఆయుధంగా వాడేవారుట.
లెక్కలు సరిగ్గా చేయకపోతే ఆ రోజు బెల్డ్ తెగాల్సిందేనట. కేవలం చదవాలి అనే ఉద్దేశంతోనే అంత కఠినంగా ఉండేవారు అన్నాడు. ఇప్పటికీ వాళ్ల నాన్న..కొట్టిన దెబ్బలు కలలోకి వస్తుంటాయట. అయితే శివాజీ పెళ్లి రోజు మాత్రం తన తండ్రి తనపై ఎంత ప్రేమ ఉందో చాటుకున్నారన్నాడు. కుటుంబం నుంచి శివాజీ వేరు అవుతున్నాడని భావించిన తండ్రి బావోద్వేగానికి గురయ్యారట. ఇంటి నుంచి హైదరాబాద్ వచ్చే ముందు తిరిగెళ్తే కారులోనే వెళ్లాలని ఆనాడే డిసైడ్ అయ్యాడుట.
మూడేళ్ల వరకూ ఊరువైపు చూడని శివాజీ ఆ తర్వాత మారుతి 800 కారు కొని అదే కారులోకి ఊళ్లోకి వెళ్లాడుట. అప్పటివరకూ తానేం చేస్తున్నాడో? ఎవరికీ తెలియదని అన్నాడు. అలాగే సొంతూరులో ఇల్లు..30 ఎకరాల పొలం కూడా కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అందుకే ముందే జాగ్రత్త పడ్డాను అన్నాడు.