సైమా 2024 వేదికను షేక్ చేసిన హాట్ గాళ్స్
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్ లో ఎప్పటిలాగే అంగరంగ వైభవంగా సాగాయి.
వ్వాటే డ్యామ్న్ నైట్ దిస్ ఈజ్! SIIMA అవార్డ్స్ నైట్ పార్టీ అదిరిపోయింది. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోని ఉత్తమ చిత్రాల నుంచి ప్రతిభను ప్రదర్శించడమే గాక.. పరిశ్రమలోని తారల అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌ను ఆవిష్కరించిన అరుదైన వేదికగా సైమా నిలిచింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్ లో ఎప్పటిలాగే అంగరంగ వైభవంగా సాగాయి.
తెలుగు,తమిళం, కన్నడ, మలయాళ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. సౌతిండియన్ స్టార్లలో అందాల భామల క్యాట్ వాక్ మెరుపులు ఈ వేదిక వద్ద హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా శ్రీయ శరణ్- పూజా హెగ్డే తమ అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ బోల్డ్ అప్పియరెన్స్ తో హెడ్ టర్నర్స్ గా మారారు. కీర్తి సురేష్, మృణాళ్ ఠాకూర్, నేహా శెట్టి లాంటి నవతరం నాయికలు కూడా మతులు చెడే వేషధారణతో మైండ్ బ్లాక్ చేసారు.
వేదిక వద్ద రకరకాల చీరలు, గౌనుల్లో తళుకుబెళుకులు ప్రదర్శించారు చాలా మంది. ఇక కథానాయికలతో పాటు మేల్ స్టార్స్ కూడీ ఈ వేదిక వద్ద కనిపించారు. నాని- దేవరకొండ గ్లింప్స్ తో పాటు, అల్లు అరవింద్ వంటి సీనియర్ లు రానా, విశ్వప్రసాద్ తదితరులు సైమా వేడుకల్లో ఆకర్షణీయమైన లుక్ లో కనిపించారు.
తెలుగులో కీర్తి సురేష్ దసరాలో తన నటనకు గానూ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. హాయ్ నాన్న చిత్రానికి గాను మృణాల్ ఠాకూర్ ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డుతో సత్కరించారు. నటుడు-రాజకీయవేత్త డాక్టర్ శివ రాజ్‌కుమార్‌ను ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డుతో సత్కరించారు.
పూర్తి విజేతల జాబితా :
SIIMA 2024 తెలుగు విజేతల జాబితా:
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్నా)
ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
సహాయ పాత్రలో ఉత్తమ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్నా)
ఉత్తమ తొలి నటుడు: సంగీత్ శోభన్ (మ్యాడ్)
ఉత్తమ తొలి నటి: వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ హాస్యనటుడు: విష్ణు (పిచ్చి)
ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న, ఖుషీ)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సలార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: సౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ తొలి నిర్మాత: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ (హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేష్
SIIMA 2024 కన్నడ విజేతల జాబితా:
ఉత్తమ చిత్రం: కాటేరా
ఉత్తమ నటుడు: రక్షిత్ శెట్టి
ఉత్తమ నటి: చైత్ర ఆచార్ (టోబీ)
ఉత్తమ దర్శకుడు: హేమంత్ రావు (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
ఉత్తమ నూతన దర్శకుడు (కన్నడ): నితిన్ కృష్ణమూర్తి (హాస్టల్ హుడుగారు బేకగిద్దరే)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ధనంజయ (గురుదేవ్ హోయసల)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రుక్మిణి వసంత్ (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
ఉత్తమ తొలి నటి: ఆరాధనా (కాటెరా)
ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడు: రమేష్ ఇందిర (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
ఉత్తమ సంగీత దర్శకుడు: వి హరికృష్ణ (కాటేర)
ఉత్తమ నేపథ్య గాయని (మహిళ): మంగ్లీ (కాటెరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు): కపిల్ కపిలన్ (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
ఎక్సలెన్స్ ఇన్ సినిమా అవార్డు: శివ రాజ్‌కుమార్
తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన విజేతలను ఈరోజు (సెప్టెంబర్ 15) రాత్రి ప్రకటిస్తారు.