`ది కేరళ స్టోరీ` తర్వాత ఆదాశర్మ పాన్ ఇండియాలో అసాధరణమైన గుర్తింపు దక్కింది. ఒక్క సినిమా అమ్మడి పాపులారిటీని అంతకంతకు రెట్టింపు చేసింది. అప్పటివరకూ జర్నీ ఓ ఎత్తైతే..అప్పటి నుంచి జర్నీ మరో ఎత్తులా మారింది. ఎన్ని తెలుగు సినిమాలు చేసినా రాని ఐడెంటిటీ ఒక్క మలయాళం సినిమాతో దక్కించుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ అమ్మడికి బాలీవుడ్ అవకాశాలు క్యూ కడుతున్నాయి.
తాజాగా `కమాండో-4` లోనూ నటిస్తోంది. కమాండో సిరీస్ లో అమ్మడు ఇన్ స్పెక్టర్ భావనా రెడ్డి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. ఆదా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టింది. తాజాగా ఈ బ్యూటీ వాస్తవ జీవితం కూడా అలా ఉంటే బాగుంటుందని తెలిపింది. `నిజ జీవితంలో కూడా భావనలా ఉండాలని ఆశపడుతున్నా. అంతవరకూ ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించాను.
కానీ ఏ పాత్ర ఇవ్వని సంతృప్తిని భావన పాత్ర కల్పించింది. అందుకే రియల్ లైఫ్ లో అలా ఉండాల నిపిస్తుంది` అని అంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ..కామెంట్లు పోస్టులు పెట్టినంత మాత్రాన దేశ భక్తి పొంగి పోర్లుతుందనే మాటలు నమ్మను. కమాండో జాతీయ భద్రతకు సంబంధించిన సినిమా. దేశంలో జరుగుతోన్న వాటికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో స్పందించడం ఒక్కటే దేశ భక్తి కాదు.
అంతకు మించి దేశంపై బాధ్యతో ఎంతో చేయాల్సి ఉంది. ఒక కామెంట్ దేశం బాగు గురించి పెట్టేస్తే అయిపోతుందా? కామెంట్ ది ఏముందు రాస్తే సరిపోతుంది. రెండు నిమిషాల పని. దేశ భక్తులు బోర్డర్ లో ప్రజల క్షేమం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. మరెంతో మంది మేధావులు దేశానికి వివిధ రూపాల్లో తమ సేవల్ని అందిస్తున్నారు. శాస్త్రసాంకేతి రంగాల్లో...ప్రభుత్వాలు నడిపిచడంలో ఎంతో మంది తమ జీవితాల్ని త్యాగం చేస్తున్నారు. నిజమైన దేశభక్తులు వాళ్లు. అలాంటి వారికి నా సెల్యూట్` అని చెప్పుకొచ్చింది.