'RX 100', 'బేబీ' బ్యూటీలే కాదు... మేమూ ఉన్నాం బాబు
అమ్మాయిలు ఇలానే ఉంటారంటూ తప్పుబడుతున్నారు
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'బేబీ'. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పుడీ చిత్రం దాదాపు రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కు చేరువలో ఉంది అంటే.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చినా ఈ సినిమాను.. మరీ ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ఎందుకంటే.. యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంది. సినిమాలో కనిపించే చాలా సన్నివేశాలు ఈ జనరేషన్ యువతీ యువకుల మధ్య ఉన్న ప్రేమకు.. వారి ఆలోచనా విధానాలకు అద్దం పట్టేలా తీశారు. దీంతో కాలేజీ కుర్రాళ్ల పుణ్యామా అని సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అయితే ఈ సినిమా పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. అందుగా ముందుగా మాట్లాడుకుంటోంది హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించే.
ఎందుకంటే ఈ చిత్రంలో వైష్ణవి చేసిన పాత్ర, ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. థియేటర్స్‌లో విజిల్స్ పడ్డాయి. అయితే ఇదే సమయంలో సినిమాలో వైష్ణవి చైతన్య పాత్ర చేసిన తప్పుకు.. నెటిజన్లు(అబ్బాయిలు) రియల్ లైఫ్‌లో అమ్మాయిలను ఉద్దేశిస్తూ తప్పుగా ఊహించుకుంటున్నారు.
అమ్మాయిలు ఇలానే ఉంటారంటూ తప్పుబడుతున్నారు. గతంలో 'ఆర్ఎక్స్ 100'లో పాయల్ రాజ్‌పుత్ పాత్ర కూడా ఇలానే ఉంటుంది. హీరోను మోసం చేసేదిలా. దీంతో అందరూ 'RX 100', 'బేబీ' చిత్రాల హీరోయిన్ల సీన్లను సోషల్‌మీడియా షేర్ చేస్తూ అమ్మాయిలను తిడుతున్నారు.
అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది చూస్తే.. సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నో బెస్ట్ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. అందులో హీరో కోసం హీరోయిన్లు పడే ఆరాటం, వారి ఆలోచనలు, మాటలు, ఉండే విధానం కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం 'ఆర్స్ఎక్స్ 100', 'బేబీ' హీరోయిన్లకు సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతుంటే.. ఇప్పుడు దానికి దీటుగా తెలుగు చిత్రసీమలోని లవ్ స్టోరీస్‌లో బెస్ట్ హీరోయిన్స్ రోల్స్‌ను ఒకచోటకు చేర్చి వీడియోగా క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
ఈ వీడియోలో గోదావరి(రూపా), మణిరత్నం సఖి(శాంతి), నువ్వొస్తానంటే నేనొద్దంటానా(సిరి), అంటే సుందరానికి(లీలా), సీతారామం(సీత).. ఇంకా పలు సినిమాల్లోని హీరోయిన్ పాత్రలను ఇందులో చూపించారు. 'అబ్బాయిలు భయపడకండి. మంచి అమ్మాయిలు' కూడా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా సినిమాలోని పాత్రలను సీరియస్‌గా తీసుకోవడం సరికాదని, బయట రియల్ లైఫ్ ప్రపంచంలోని ఉండాలని అంటున్నారు. బయట మంచి చెడు రెండు ఉన్నాయని చెబుతున్నారు.