టాలీవుడ్‌పై క‌న్నేసిన మరో సీనియ‌ర్ న‌టి

భార‌తీయ సినీచ‌రిత్ర‌లో తెలుగు సినీప‌రిశ్ర‌మ స‌రికొత్త అధ్యాయాల‌ను లిఖిస్తోంది

Update: 2024-01-05 04:15 GMT

భార‌తీయ సినీచ‌రిత్ర‌లో తెలుగు సినీప‌రిశ్ర‌మ స‌రికొత్త అధ్యాయాల‌ను లిఖిస్తోంది. పాన్ ఇండియా స్టార్ డ‌మ్‌ని మ‌రో లెవ‌ల్ కి చేర్చిన ఘ‌న‌త టాలీవుడ్ కే చెందుతుంది. రాజ‌మౌళి, సుకుమార్ లాంటి ద‌ర్శ‌కులు త‌మ హీరోల్ని పాన్ వ‌ర‌ల్డ్ రేంజుకు చేర్చ‌డంతో ఇప్పుడు ఇతర ద‌ర్శ‌కులు కూడా అలాంటి ప్ర‌య‌త్నాల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్నారు. అదే క్ర‌మంలో బాలీవుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌ముఖ తార‌ల చూపు టాలీవుడ్ పై ప‌డింది. ఇటీవ‌ల తెలుగు చిత్రసీమ‌లో ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా వెంట‌నే అందిపుచ్చుకోవాల‌ని భావించే ఉత్త‌రాది భామ‌లు ఉన్నారు.


సీనియ‌ర్ హిందీ తార‌లు కాజోల్, ర‌వీనా టాండ‌న్, హ్యూమా ఖురేషి సౌత్ సినిమాల్లో క‌నిపించారు. కేజీఎఫ్ 2లో ర‌వీనా టాండ‌న్ పోషించిన పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఇప్పుడు అదే తీరుగా అలాంటి అవ‌కాశం త‌న‌వైపు వ‌స్తే న‌టించేందుకు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి, అందాల క‌థానాయిక మాధురి ధీక్షిత్ సిద్ధంగా ఉన్నాన‌ని హింట్ ఇచ్చారు.

2024లో భారీ ప్ర‌ణాళిక‌లు ఉన్నాయి. వెబ్ సిరీస్ ల‌లోను న‌ట‌స్తున్నాన‌ని మాధురి వెల్ల‌డించారు. మాధురి, త‌న‌ భర్త డాక్టర్ శ్రీరామ్ నీనే నిర్మించిన మరాఠీ ప్రొడక్షన్ 'పంచక్' విడుద‌లైంది.. ఈ సంద‌ర్భంగా ప్ర‌చార‌ ఇంటర్వ్యూలో ప్రేక్షకులు మీ తదుపరి చిత్రాన్ని ఎప్పుడు చూడగలరు? అని అడిగారు. చివరిసారిగా 2022లో అమెజాన్ ప్రైమ్ వీడియో చిత్రం 'మజా మా'లో కనిపించారు. కానీ పెద్ద తెర‌పై క‌నిపించ‌లేదు.

ఈ సంవత్సరం ప‌లు సినిమాల్లో న‌టించ‌నున్నాను. నా రియాలిటీ షో 'డాన్స్ దీవానే' కూడా ప్రారంభమవుతుంది. కచ్చితంగా సినిమాలు తీస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కూడా ఉండవచ్చు.. కానీ దాని గురించి ఇప్పుడే చెప్పడానికి చాలా తొందరగా ఉంది. కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం మరింత చురుకుగా ప్లాన్ చేస్తున్నాను'' అని తెలిపారు. సౌత్ లో న‌టించేందుకు కూడా త‌న ఆస‌క్తిని వ్య‌క్తం చేసారు.

గెలుపోట‌ముల గురించి మాధురి మాట్లాడుతూ ''విజయం- వైఫల్యం ఎల్లప్పుడూ మన జీవితంలో ఒక భాగం. అయితే మ‌నం ప్రతి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటాము. కానీ అది ఎవరి జీవితంలో సాధ్య‌మ‌వుతుందో ఎవ‌రికీ తెలియదు. కానీ వైఫల్యాల నుంచి నేర్చుకుంటాము. మీరు వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని గురించి ఆలోచించాలి... దాని నుండి నేర్చుకుని ముందుకు సాగాలి. ప్రస్తుతం పంచక్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు. రాహుల్ అవతే - జయంత్ జాతర్ దర్శకత్వం వహించిన మ‌రాఠా చిత్రం 'పంచక్‌' చిత్రంలో అద్దినాథ్ కొఠారే, తేజశ్రీ ప్రధాన్, దిలీప్ ప్రభావల్కర్, భారతీ అచ్రేకర్, దీప్తి దేవి, సతీష్ అలేకర్ త‌దిత‌రులు న‌టించారు.

Tags:    

Similar News