రెండో భర్త కూడా మోసగాడే.. నటి మహలక్ష్మీ ఆవేదన
కొన్ని నెలల క్రితం భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన వారు అచ్చెరువు చెందేలా తమిళ నటి మహలక్ష్మి పెళ్లి చోటు చేసుకుంది.
కొన్ని నెలల క్రితం భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలకు చెందిన వారు అచ్చెరువు చెందేలా తమిళ నటి మహలక్ష్మి పెళ్లి చోటు చేసుకుంది. భర్తతో విడిపోయిన ఆమె.. తమిళ నిర్మాత రవిందర్ చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకున్న వైనం.. తమ పెళ్లి వేళ తీసుకున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకోవటం తెలిసిందే. వీరి పెళ్లి ముచ్చట ఎంతలా పాపులర్ అయ్యిందో తెలిసిందే. సినిమాల్లో నటిగా వెండితెర మీద మంచి మార్కులు వేయించుకునే మహలక్ష్మి వ్యక్తిగత జీవితంలో మాత్రం విమర్శలకు గురి అవుతుంటుంది.
కొడుకు పుట్టిన తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె.. కొన్నాళ్లకు తమిళ నిర్మాతను పెళ్లాడిన వైనం అందరూ మాట్లాడుకునేలా చేసింది. కొందరైతే.. డబ్బుల కోసమే ఆమె అతన్ని పెళ్లి చేసుకుందని ఆమెను అనరాని మాటలు అనేశారు. మరికొందరు మాత్రం ప్రేమ గుడ్డిదంటే దీనికి మించిన ఉదాహరణ ఏం ఉంటుందన్న వ్యాఖ్యలు చేశారు. తాజాగా మళ్లీ ఆమె వార్తల్లోకి రావటానికి కారణం.. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రవీందర్ ప్రస్తుతం జైల్లో ఉండటమే.
తాజాగా ఒక చీటింగ కేసులో రవీందర్ ను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యక్తిని నమ్మించి డబ్బులు కాజేశారన్న నేరం మీద ఆయన్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న భర్త గురించి మహలక్ష్మి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. భర్త ప్రస్తావన తీసుకురాకుండా.. తన సోషల్ మీడియా ఖాతాలో మాత్రం ఎప్పటికప్పుడు తన ఫోటోల్ని అప్డేట్ చేస్తున్న వైనంపై పలువురు ఆమెను తప్పు పడుతున్నారు.
నిజంగానే.. ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లేదంటే.. డబ్బు మీద ఆశతో ప్రేమించావా? అంటూ విమర్శలకు దిగుతున్నారు. దీంతో.. ఆమె స్పందిస్తూ.. తన భర్త చీటర్ అని తనకు తెలీదని.. తెలిస్తే అస్సలు పెళ్లి చేసుకునేదానిని కాదంటూ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా చెబుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం.. ఇదంతా ఆమె ముందస్తు ప్లాన్ చేసి.. భర్తను ఇరికించి కేసు పెట్టించి.. జైలుకు పంపినట్లుగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమిళనాట వార్తల్లో నటి మహలక్ష్మి ఉదంతం ఇప్పుడు అందరి నోట మరోసారి నానుతోంది.