చీరందంలో మత్తెక్కిస్తోన్న నాగినీ అందం!
బాలీవుడ్ అందం మౌనీ రాయ్ అలియాస్ నాగిని ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ అందం మౌనీ రాయ్ అలియాస్ నాగిని ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆందాల ఆరోబోతలో అమ్మడు ముందు వరుసలో ఉంటుంది. టూపీస్.. స్విమ్ షూట్ బికీనీల్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెరిచిన పుస్తకం వలే అందాలు ఆరబోస్తుంది. సందర్భం ఏదైనా మౌని ఘాటు ఫోజులకు ఎవరైనా ప్లాట్ అవ్వాల్సిందే. అంతగా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుందీ నాగిని.
తాజాగా అమ్మడు చీరందంలో కవ్వింపు చర్యలకు దిగిందిలా. ఇదిగో ఇక్కడిలా డార్క్ బ్లూ కలర్ చీరందంలో నడుం అందాల్ని హైలైట్ చేసింది. మ్యాచింగ్ తెలుపు రంగు బ్లౌజు ధరించి చూపరులను ఆకర్షించింది. నేలపై పడుకుని ...పరుపుపై తలకి సపోర్టు గా చేయిని పెట్టి కెమెరాకి వివిధ భంగిమల్లో ఫోజులిచ్చింది. అమ్మడి స్కిన్ టోన్ పాల నురుగుల సౌందర్యమే. సొగసరి మ్యాకప్, అలంకరణ మౌనీని మరింత అందంగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
మౌని రాయ్ మల్టీట్యాలెంటెడ్. మోడలింగ్ నుంచి అటుపై గాయనిగా..నటిగా ఫేమస్ అయింది. తొలుత సినిమాలకన్నా టీవీషోలతోనే మౌనీరాయ్ బాగా ఫోకస్ అయింది. పాప్ ఆల్బమ్ సింగర్ గానూ మౌనీరాయ్ శ్రోతల్ని అలరించింది. బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటుంది. మునుపటి కంటే మరింత వేగంగా పనిచేస్తోంది. గత ఏడాది ఖాళీగా ఉన్నా 2024 లో మాత్రం నాలుగైదు కమిట్ మెంట్లతో కనిపిస్తుంది.
ఆ మధ్య `బ్లాకౌట్` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే రిలీజ్ అయిన జాన్ అబ్రహం `వేద`లోనూ స్పెషల్ అప్పిరియన్స్ తో అలరించింది. ఆ సినిమా ప్లాప్ అయినా మౌనీ రాయ్ పెర్పార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న మరో రెండు చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.