మృణాల్.. మత్తెక్కించేసే స్టైలిష్ సొగసులు
ఇక కేవలం ఒక భాషకు పరిమితం కాకుండా బాలీవుడ్ తో పాటు సౌండ్ ఇండస్ట్రీని కూడా అమ్మడు బాగానే కవర్ చేస్తోంది
మొదట మోడల్ గా మంచి గుర్తింపునందుకొని ఆ తర్వాత వివిధ ఇండస్ట్రీలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ మృణాల్ ఠాగూర్. అమ్మడు ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసిన కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎందుకంటే సినిమా సినిమాకు కూడా విభిన్నంగా కనిపించేలా మంచి పాత్రలు అయితే సెలెక్ట్ చేసుకుంటుంది.
ఇక కేవలం ఒక భాషకు పరిమితం కాకుండా బాలీవుడ్ తో పాటు సౌండ్ ఇండస్ట్రీని కూడా అమ్మడు బాగానే కవర్ చేస్తోంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు ఆమె ఫ్యాన్ ఫాలోవర్స్ ను అయితే పెంచేస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసిన కూడా నిమిషాల్లో వైరల్ పోతూ ఉంటాయి.
ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ మరోసారి స్టైలిష్ డ్రెస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. చాక్లెట్ కలర్ లో ఉన్న ఒక స్టైలిష్ డ్రెస్ లో అమ్మడు మత్తెక్కించే విధంగా దర్శనమిచ్చింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. గతంలో అమ్మడు వీటిని అందాలతో కూడా కనిపించి ఆకట్టుకుంది. కానీ ఈ తరహా స్టిల్ మాత్రం మరింతగా ఆకట్టుకుంటుంది అని పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.
అమ్మడి ఫోజులు కూడా ప్రతి ఫోటోలో ప్రత్యేకంగా ఉన్నాయి. ఇక ఎక్కువగా మేకప్ లేకుండా చాలా సింపుల్ గానే హావా భావాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తన చూపులతో కూడా మృణాల్ మాయ చేస్తోంది అన్నట్లుగా మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వరుసగా మూడు సినిమాలు చేసింది.
ముఖ్యంగా లాస్ట్ స్టోరీస్ 2 అనే కంటెంట్ తో కూడా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అయితే ఈ బ్యూటీ చేతిలో మొత్తంగా ఐదు సినిమాలు ఉన్నాయి. ఇక అందులో మూడు సినిమాలు హిందీలో చేస్తుండగా మరో రెండు సినిమాలు తెలుగులో చేస్తోంది. నాని హాయ్ నాన్న సినిమాతో పాటు విజయ్ దేవరకొండ 13వ సినిమాలో అమ్మడు హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా ఒక డిఫరెంట్ కంటెంట్‌తో తెరపైకి రాబోతున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో అమ్మడు అగ్ర హీరోల పాన్ ఇండియా సినిమాలు కూడా చేసే అవకాశం అయితే ఉంది.