సమంతను పట్టుకొని అంత మాట అన్నాడా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమెకు కేవలం తెలుగులోనే కాకుండా, దక్షిణాదిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమెకు కేవలం తెలుగులోనే కాకుండా, దక్షిణాదిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ తర్వాత ఆమెకు నార్త్ లోనే ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అందుకే ఆమెకు ఇప్పటికీ వరస ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా ఆమె విజయ్ దేవర కొండతో కలిసి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ ఖుషీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
అయితే, ఈ మూవీ ప్రమోషన్స్ ఇండియాలో పూర్తి చేసిన తర్వాత సమంత అమెరికా వెళ్లారు. నిజానికి చికిత్స నిమిత్తం ఆమె అమెరికా వెళ్లారు. అయితే, పనిలో పనిగా ఆమెను మూవీ టీమ్ ప్రమోషన్స్ చేయమని కోరారు. దీంతో, అమెరికాలో ఉన్న ఇండియన్స్ తో గ్రీట్, మీట్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో పాల్గొన్నందుకు సమంతకు 25వేల డాలర్లు చెల్లించారు.
రూల్స్ ప్రకారం ఆమె దాదాపు రెండు గంటలు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. అయితే, కేవలం గంటన్నర ప్రోగ్రామ్ లో ఉండి, ఆ తర్వాత వెళ్లిపోయిందట. అయితే, సమంత లగేజ్ బాధ్యత అంతా ఆమె మేనేజర్ తీసుకున్నారు. సమంత కారు వెనక ఈ లగేజ్ ఉన్న కారు వెళ్లాల్సి ఉండగా, దానిని ఈవెంట్ ఆర్గనైజర్లు దాదాపు గంటపాటు నిలిపివేశారు. ఆ తర్వాత ఆ కారును కూడా వెళ్లనిచ్చారు.
అయితే, సమంత వెళ్తున్న కారు డ్రైవర్ కి ఫోన్ చేసిన ఈవెంట్ మేనేజర్ ఆమెను ఓ బూతు పదంతో తిట్టాడట. ఆ సమయంలో కారులో బ్లూటూత్ ఆన్ లో ఉండటంతో, ఆ మాట సమంత చెవిన కూడా పడింది. ఆ మాట విని ఆమె చాలా బాధపడినట్లు తెలుస్తోంది. అయినా కూడా, ఆ విషషయంలో ఆమె ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమచారం. డబ్బులు తీసుకొని, చెప్పిన సమయం వరకు ఉండలేదనే అతను తిట్టినట్లు తెలుస్తోంది. అయినా కూడా అలా బూతులు తిట్టడం కరెక్ట్ కాదు కదా అనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. కానీ, సమంత ఎంత బాధపడినా, ఈ విషయాన్ని పెద్దది చేయాలని అనుకోకపోవడం విశేషం.
ఇక, ఇక, ఈ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్. ఈ మూవీ లో సమంత, విజయ్ ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఫ్యాన్స్ కి మాత్రం విపరీతంగా నచ్చేస్తోంది.