శ్రీలీల సింపుల్ అండ్ బ్యూటిఫుల్
దుస్తుల ఎంపికలో నేను సౌకర్యాన్ని నమ్ముతాను. కాబట్టి సౌకర్యవంతంగా ఉండే ఏదైనా ధరించడానికి ఇష్టపడతాను
తనదైన యూనిక్ డ్యాన్సింగ్ స్టైల్‌తో ప్రత్యేకించి అభిమానులను సంపాదించుకుంది శ్రీలీల. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి పాటతో మరింతగా మాస్ లో కనెక్టయింది ఈ బ్యూటీ. ధమాకా, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సహా పలు చిత్రాల్లో నటించిన శ్రీలీల తన ప్రతిభతో అభిమానులను ఆకర్షించింది. శ్రీలీలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ఈ బ్యూటీ బెంగళూరు నుండి ఫ్యాషన్ బ్రాండ్ అయిన రేరిజం ప్రారంభోత్సవంలో కనిపించింది. ఇది హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్లో మూడవ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. మహిళలకు ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని కల్పిస్తూ ఈ ఫ్యాషన్ఫార్వర్డ్ బ్రాండ్ ప్రారంభోత్సవం శ్రీలీల చేతుల మీదుగా జరిగింది.
స్టోర్ లాంచ్ లో శ్రీలీల స్పెషల్ డిజైనర్ లుక్ లో కనిపించింది. నిజానికి గ్లామర్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తూ ఎందరో యువతులకు ఇన్స్పిరేషన్గా నిలిచిన శ్రీలీల ఎప్పుడూ స్టైల్ స్టేట్మెంట్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా తాను ఎంపిక చేసుకున్న దుస్తులు సౌకర్యం కోసం ప్రాధాన్యత.. అని శ్రీలీల చెప్పింది. ఈ కొత్త లుక్ లో ఎంతో స్పెషల్ గా కనిపిస్తున్న ఈ బ్యూటీ.. డిజైనర్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. `బ్యాలెన్స్ ది ఇన్ అండ్ యాంగ్` అంటూ దీనికి శీర్షికను కూడా జోడించింది శ్రీలీల.
దుస్తుల ఎంపికలో నేను సౌకర్యాన్ని నమ్ముతాను. కాబట్టి సౌకర్యవంతంగా ఉండే ఏదైనా ధరించడానికి ఇష్టపడతాను. అది నా స్టైల్ అండ్ ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ అని అంది. తాజాగా ఈ బ్యూటీ ధరించిన డిజైనర్ దుస్తులు గ్లామర్ కోణంలో కాకుండా సౌకర్యం అనే కోణంలో ఆకర్షిస్తున్నాయి. శ్రీలీల తదుపరి కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించాల్సి ఉండగా, ఈ సినిమా చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమవుతోంది. మరోవైపు తమిళంలో శివకార్తికేయన్ సరసన అవకాశం అందుకుంది. విజయ్ దేవరకొండ తదుపరి సినిమా నుంచి తప్పుకుందని ఇటీవల ప్రచారమైంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
స్టడీస్‌పై ఫోకస్ కోసం:
విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలో శ్రీలీల స్థానంలో త్రిప్తి డిమ్రీ లేదా రుక్మిణి వసంత్ నటిస్తారని కథనాలు వచ్చినా కానీ, త్రిప్తి అందుబాటులో లేకపోవడం భారీ పారితోషికం డిమాండ్ నేపథ్యంలో అందుకు ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ పరిణామాలపై శ్రీలీల స్పందిస్తూ.. తన చదువుపై దృష్టి పెట్టేందుకు నటనకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. తన విద్యను పూర్తి చేసి అటుపై తనకు నచ్చే ప్రాజెక్ట్‌లను కనుగొన్న తర్వాత పరిశ్రమకు తిరిగి రావాలని యోచిస్తోందని టాక్. అయితే స్పై థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న VD12 లో నటించేందుకు వీలుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.