ఊర్వ‌శి రౌతేలా పెళ్లి 7 ర‌కాలుగా ప్లానింగ్‌

అలాగే అమ్మ‌డిని ఇన్ని ర‌కాల కోరిక‌ల‌తో పెళ్లి చేసుకోవాలంటే మంచి సౌండ్ పార్టీ అయి ఉండాలి. అత‌గాడికి ఊర్వ‌శిలా ప్యాంట‌సీ కోరిక‌లు క‌లిగి ఉండాలి

Update: 2023-09-11 04:53 GMT

పెళ్లి ఎవ‌రైనా వారి మ‌త సంప్ర‌దాయాల ప్ర‌కారం ఒకేసారి..ఒకేచోట చేసుకుంటారు. కానీ ఏడు ర‌కాలుగా ఎవ‌రైనా పెళ్లి చేసుకుంటారా? అలాంటి ప్లానింగ్ ఎవరికైనా ఉంటుందా? అంటే హాట్ సెరైన్ ఊర్వ‌శి రౌతేలా మాత్రం అలాంటి ఐడియాతోనే ఉంది. తాజాగా అమ్మ‌డు త‌న పెళ్లి ఎలా జ‌ర‌గాలో డిసైడ్ చేసింది. రెండు..మూడు ప‌ద్ద‌తుల్లో కాదు ఏకంగా 7 ర‌కాలుగా పెళ్లి చేసుకోవాలని క‌ల‌లు కంటోంది. అమ్మ‌డి మ‌తం ఏంటి అన్న‌ది తెలియదుగానీ... వివాహం ఏడు ర‌కాలుగా చేసుకుని చ‌రిత్ర‌లోకి ఎక్కుతానంటోంది.

బీచ్ లో ఒక‌సారి.. బెంగాలీ సంప్ర‌దాయంలో మ‌రోసారి.. క్రైస్త‌వ‌..హిందు సంప్ర‌దాయాల్లో.. థీమ్ బేస్డ్ గా.. డెస్టినేష‌న్ వెడ్డింగ్..క్రూజ్ లో ఇలా సెవెన్ వండ‌ర్స్ లో వివాహం చేసుకుని ఆ మ‌ధురానుభూతుల ఆస్వాదించాలి అంటోంది. అలాగే కాబోయే భ‌ర్త‌లో త‌న‌కంటూ కొన్ని ప్ర‌త్యేక‌మైన అభిప్రాయాలు న్నాయ‌ట. వాటికి త‌ప్ప‌కుండా ఆ కుర్రాడు మ్యాచ్ అవ్వాల్సిందేన‌ట‌. ఆ విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌శ‌క్తే లేదంటోంది. మ‌రి ఇలా ఇన్ని ర‌కాలుగా సంతృప్తి ప‌రిచే ఆ వ‌రుడు ఎక్క‌డ ఉన్నాడో? ఎప్పుడు తార‌స‌ప‌డ‌తాడో? ఎలా ఉంటాడో? చూద్దాం.

అలాగే అమ్మ‌డిని ఇన్ని ర‌కాల కోరిక‌ల‌తో పెళ్లి చేసుకోవాలంటే మంచి సౌండ్ పార్టీ అయి ఉండాలి. అత‌గాడికి ఊర్వ‌శిలా ప్యాంట‌సీ కోరిక‌లు క‌లిగి ఉండాలి. ఆమెలాగే ఆలోచించ‌గ‌ల‌గాలి. అమ్మ‌డి వేగాన్ని అందుకోవాలి. ఇలాంటివి స‌వా ల‌క్ష ఉంటాయి. అత‌ను స్వ‌దేశీయుడు అవుతాడా? విదేశీయుడు అవుతాడా? అన్న‌ది చూద్దాం. ఇక ఊర్వ‌శి రౌతేలా కెరీర్ సంగ‌తి చూస్తే ఐటం పాట‌ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు సినిమాలో ఐటం పాట అంటే ఊర్వ‌శి ఉందా? అనే చ‌ర్చ సాగుతోంది. ఆ రేంజ్ లో అమ్మ‌డు టాలీవుడ్ లో ముద్ర వేసింది.

ఇటీవ‌లే 'వాల్తేరు వీర‌య్య‌'..'బ్రో'ల‌తో మంచి విజ‌యాలు ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా చిత్రం 'స్కంద‌'లో ఆడిపాడుతుంది. కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు క్యూలో ఉన్నాయి. బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News