గుబులు రేపుతున్న సీనియర్ నటి ఫ్యాషన్ షో
మరోవైపు మ్యగజైన్ కవర్ షూట్లతోను యువతరం హృదయాలను దోచేస్తున్నారు రవీనా.
90ల నాటి మేటి కథానాయికగా ఓ వెలుగు వెలిగిపోయిన రవీనా టాండన్ ఇప్పటికీ వన్నె తరగని అందంతో కవ్విస్తూనే ఉన్నారు. అప్పట్లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బుడ్డా హోగా తేరా బాప్ చిత్రంతో రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన రవీనా ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వెబ్ షోలలో నటిస్తున్నారు. మరోవైపు మ్యగజైన్ కవర్ షూట్లతోను యువతరం హృదయాలను దోచేస్తున్నారు రవీనా.
తాజాగా ఈ సీనియర్ నటి ట్రెండీ లుక్ ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇది ఫెమీనా కవర్ ఫోటో. రవీనా బ్లాక్ అండ్ బ్లాక్ డిజైనర్ లుక్ లో అందంగా కనిపించింది. అయితే ఈ డిజైనర్ లుక్ ని పరిశీలనగా చూస్తే రవీనా బికినీ లాంటి ఇన్నర్ ని ధరించినట్టు కనిపిస్తోంది. దానిపై డిజైనర్ మఖమల్ టాప్.. జల్లెడ అల్లికలాంటి డిజైన్ బాటమ్ వేర్ ధరించి చాలా బోల్డ్ గా స్పెషల్ గా కనిపిస్తోంది. రవీనా సింపుల్ స్మైలీ లుక్ యువతరం హృదయాలను గెలుచుకుంటోంది.
ఈ కవర్ ఫోటోకి ఫెమీనా ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది. ``అవార్డు గెలుచుకున్న ప్రదర్శనల నుండి పాప్-కల్చర్ దృగ్విషయం వరకు.. రవీనా అక్కడే ఉంది. అన్నింటినీ చేసింది. సినిమా వ్యాపారంలో జీవితంలోని పరాజయాలు విజయాలతో సమానంగా, పద్మశ్రీ గ్రహీత .. జాతీయ అవార్డు-గ్రహీత అయిన నటీనటులు ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తారు.. ఎప్పుడూ ఒకేలా స్థిరపడకుండా.. ఆమె(రవీనా)కు వీలైనప్పుడల్లా జోక్ పేల్చడానికి ప్రయత్నిస్తారు!`` అన రాసింది. సురేష్ నటరాజన్ స్పెషల్ ఫోటోషూట్ లో రవీనా ఇంత అందంగా కనిపిస్తోంది.
రవీనా టాండన్ తన కెరీర్ సహా వ్యక్తిగత జీవితం గురించి తాజా ఇంటర్వ్యూలో నిక్కచ్చిగా చెప్పింది. నేను నా 90ల నాటి దుస్తులను మళ్లీ ధరిస్తున్నాను.. అదృష్టవశాత్తూ నేను వాటిని ధరించాను. పత్తర్ కే ఫూల్ (1991)లోని స్కార్పియన్ డిజైన్‌తో కూడిన డెనిమ్ జాకెట్, షెహెర్ కీ లడ్కీ ..లెదర్ షర్ట్ ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. ఊహించుకోండి.. ఇప్పుడు రాషా వాటిని ధరించింది! అని కూడా రవీనా చెప్పింది.
ప్రస్తుతం రివెంజ్ వెబ్ సిరీస్ `కర్మ కాలింగ్`లో ఇంద్రాణి కొఠారి పాత్రలో కనిపించిన టాండన్, అమెరికన్ షో రివెంజ్ కి భారతీయ రీమేక్ దశాబ్దం క్రితం తన వద్దకు వచ్చిందని, కానీ టీవీ కోసం మాత్రమేనని వెల్లడించారు. అయితే అప్పట్లో ఆ ప్రాజెక్ట్ చేయలేదు. ఎందుకంటే మొదట నేను ఇంద్రాణిని వృత్తిపరంగా చూడటానికి సిద్ధంగా లేను. రెండవది వారు కోరుకున్న తేదీలు చాలా ఉన్నాయి. టీవీ అనేది పొడవైన ఫార్మాట్. ఈ సీరియల్ దానిని సొగసైనదిగా.. కొంచెం కాంపాక్ట్‌గా చేసింది`` అని రవీనా టాండన్ చెప్పారు.
49 ఏళ్ల రవీనా `కర్మ కాలింగ్` తో సంతృప్తికరంగా ఉన్నారు. తన అభిమానుల ఫేవరెట్ చిత్రాల రీమేక్ లలో నటించవచ్చు కదా? అన్న ప్రశ్నకు.. ముఖ్యంగా క్లాసిక్ కామెడీ అందాజ్ అప్నా అప్నా (1994) సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. రీమేక్‌లు మంచి ఎంపిక కాదని టాండన్ అభిప్రాయపడ్డారు. క్లాసిక్ ని రీమేక్ చేస్తే అది కూడా దాని స్థాయిలో బాగానే ఉండవచ్చు.. కానీ పోలికలు ఇప్పటికీ చూడటం ప్రమాదకరం.. అని అన్నారు.