DGL: మళ్ళీ ఇన్నాళ్లకు క్రాంతి మాధవ్ ప్రాజెక్ట్

ఈ సినిమా గంట కార్తిక్ రెడ్డి నిర్మాణంలో ఆర్తి క్రియేటివ్ టీమ్ బ్యానర్ పై తెరకెక్కనుంది.

Update: 2024-09-14 13:12 GMT

సెన్సిబుల్ డైరెక్టర్ కే గుర్తింపు అందుకున్న క్రాంతి మాధవ్ తన కెరీర్ లో ఎన్నో భావోద్వేగాల కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో కొత్త సినిమా ప్రకటించారు. ఈ సినిమా గంట కార్తిక్ రెడ్డి నిర్మాణంలో ఆర్తి క్రియేటివ్ టీమ్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ సినిమా టైటిల్ డిజిఎల్ అని పోస్టర్ ద్వారా వెల్లడించారు.


పోస్టర్ లో కథానాయకుడు ఒక రైల్వే ట్రాక్ పై నిల్చొని, బ్యాక్ సైడ్ నుంచి తన టీ షర్ట్ పైకి లేపుతూ ఉన్న తీరు ఆసక్తికరంగా ఉంది. అతని చుట్టూ రైలు ట్రాక్స్ మీద రైళ్లు నడుస్తున్నాయని, ఈ సన్నివేశం కాజీపేట జంక్షన్ లో తీసినట్లు కనిపిస్తుంది. ఈ పోస్టర్ పై "జర్నీ బిగిన్స్" అనే సందేశం ఉంటుండటం, సినిమా సబ్జెక్ట్ పై మరింత ఆసక్తి పెంచింది.


ఇక మేకర్స్ విడుదల చేసిన మరో పోస్టర్ లో కొంత మంది స్నేహితులు రైల్వే బ్రిడ్జ్ పై సరదాగా గడుపుతూ ఉన్నట్లు చూపించారు. ఈ రెండు పోస్టర్లలోని డిఫరెంట్ ఎలిమెంట్స్, సినిమాపై క్యూరియాసిటీని పెంచడంతో పాటు ప్రేక్షకుల్లో కొత్త తరహా కథ మీద అంచనాలను పెంచాయి. క్రాంతి మాధవ్ తరచుగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసే దర్శకుడు అనే విషయం తెలిసిందే.

ఈ సారి కూడా అతను యదార్థ ఘటనల ఆధారంగా రూపొందించిన ఓ సెన్సిబుల్ కథను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ 2024 నవంబర్ లో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాకు జ్ఞాన శేఖర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. శేఖర్, క్రాంతి మాధవ్ కలయికలో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది.

ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం, సినిమా మీద ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇక డిజిఎల్ సినిమా కోసం ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల జాబితాను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. రైల్వే ట్రాక్, కాజీపేట జంక్షన్ లాంటి లొకేషన్స్ తో, యువతకు సంబంధించిన క్షణాలను టచ్ చేస్తూ తీసుకురాబోతున్న ఈ కథ ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags:    

Similar News