ఆ బ్యూటీ సీనియర్లకు మరో ఆప్షన్!
దీంతో నటించిన హీరోయిన్లనే మళ్లీ మళ్లీ తీసుకోవాల్సి వస్తోంది.
టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ అవ్వడం అన్నది ఎంత కష్టంగా ఉందో తెలిసిందే. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్యలకు హీరోయిన్లు? ఎంపిక చేయడం దర్శకులకు చాలా కష్టం మారంది. వారి ఇమేజ్ ని మ్యాచ్ చేసే భామ అంత ఈజీగా మార్కెట్ లో దొరకడం లేదు. దీంతో నటించిన హీరోయిన్లనే మళ్లీ మళ్లీ తీసుకోవాల్సి వస్తోంది. ఆ కారణంగా ప్రేక్షకుడికి ప్రెష్ ఫీల్ రావడం లేదు. ఒకే ప్రేమ్ లో ఒకే ఫేసులు చూసి అభిమానులకు సైతం బోర్ కొడుతుంది.
సీనియర్ భామలంటే? త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రియ ఇలా వీళ్లు తప్ప మరొకరు కనిపించడం లేదు. అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' లో విక్టరీ వెంకటేష్ కి భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ ని అనిల్ రావిపూడి ఎంపిక చేయడం కాస్త ప్రెష్ ఫీల్ ని అందిస్తుంది. ఇకపై ఈ భామ పైన చెప్పిన నలుగురు ఐదుగురు సీనియర్ భామలకు రీప్లేస్ మెంట్ గా చెప్పొచ్చు. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగ్ లతో వాళ్లంతా కూడా నటించిన వారే.
కానీ ఐశ్వర్య రాజేష్ మాత్రం వెంకీతో తప్ప ఇంకే వరితోనూ నటించలేదు. ఈ భామ చిరంజీవి, నాగార్జున, బాలయ్య ఇమేజ్ లకు పర్పెక్ట్ గా సూట్ అవుతుంది. ఆ హీరోలతో ఐశ్వర్య రాజేష్ వయసు వ్యత్యాసం ఉన్నా? సెట్ అవుతుంది. వెంకటేష్ -ఐశ్వర్య రాజేష్ ల ను ఆన్ స్క్రీన్ రొమాన్స్..ఆఫ్ ది స్క్రీన్ పెర్పార్మెన్స్ చూసిన తర్వాత ఆ సంగతి అర్దమవుతుంది. ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.
ఈ అమ్మడు తెలుగు నుంచి తమిళ్ లో సక్సెస్ అయిన నటి. అక్కడ చాలా సినిమాలు చేసింది. కెరీర్ ఆరంభంలో ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. నటిగా ప్రూవ్ చేసుకుని టాలీవుడ్ కి వచ్చింది. ఇకనైనా ఐశ్వర్యకు మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి.