ఐశ్వర్య రాయ్ బాత్‌రోబ్ ఫోటోల క‌ల‌క‌లం

డిజైన‌ర్ దుస్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ త‌నవైన‌ బ్రాండ్ ల‌ను ప్ర‌మోట్ చేస్తూ య‌థాత‌థంగా ఐశ్వ‌ర్యారాయ్ షో స్టాప‌ర్ గా నిలిచింది

Update: 2024-05-29 06:52 GMT

ద‌శాబ్ధాలుగా త‌నదైన అందం ప్ర‌తిభ‌తో హెడ్‌టర్న‌ర్ గా నిలుస్తోంది ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్. మాజీ ప్ర‌పంచ సుంద‌రిగా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచి ఉన్న ఐష్‌ను ఎప్ప‌టికీ అమృతం సేవించిన దేవ‌తాసుంద‌రిగానే చూస్తున్నారు. ఇటీవ‌లే కేన్స్ 2024 రెడ్ కార్పెట్ పై ఐశ్వ‌ర్యారాయ్ హొయ‌లు మ‌తులు చెడ‌గొట్టాయి. డిజైన‌ర్ దుస్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ త‌నవైన‌ బ్రాండ్ ల‌ను ప్ర‌మోట్ చేస్తూ య‌థాత‌థంగా ఐశ్వ‌ర్యారాయ్ షో స్టాప‌ర్ గా నిలిచింది.

ఇప్పుడు మ‌రోసారి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తాజాగా కేన్స్ రెడ్ కార్పెట్ ప్రదర్శన కోసం మేక‌ప్‌రూమ్‌ ప్రిప‌రేష‌న్ కి సంబంధించిన తెరవెనుక ఫోటోలను ఐష్ సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. కేన్స్ నుండి ముంబైకి తిరిగి వచ్చిన ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన‌ స్నాప్‌లలో చాలా అందంగా ప్ర‌త్యేకంగా కనిపించింది.

ఒక ఫోటోలో బాత్‌రోబ్ ధరించిన ఐశ్వర్య మస్కారా వేసుకుంటూ అద్దంలోకి చూసుకుంటూ తన కంటికి మేకప్ చేస్తూ కనిపించింది. మరో ఫోటోలో ఐశ్వర్య తన మేకప్ చైర్‌లో ప్ర‌త్యేక‌ భంగిమలో కూచుని క‌నిపించింది. ఐశ్వర్య హాట్ ఫోటోలు వీక్షించిన‌ అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ఐష్‌ రెడ్ కార్పెట్ మీద ఇలా బయటకు వెళ్లి చంపేసి ఉండవచ్చు అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించ‌గా, కేన్స్ సమయంలో మీరు ఇలాంటి హెయిర్‌స్టైల్ చేయాలనుకుంటే మ‌తి చెడుతుంది! అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు. ఈ భూమిపై అత్యంత అందమైన మహిళ అని మ‌రో నెటిజ‌న్ ప్ర‌శంసించాడు.

కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య రాయ్ తన తల్లి పుట్టినరోజు వేడుకల నుండి కొన్ని ఫోటోలను షేర్ చేసారు. ఈ ఫోటోలలో కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి పోజులిచ్చిన ఐశ్వర్య తన తల్లిని దగ్గరగా హ‌గ్ చేసుకుని కనిపించింది. అయితే ఐశ్వర్య రాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఈ వేడుక లో మిస్స‌య్యాడు.

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రెండు సార్లు రెడ్ కార్పెట్ ప్రదర్శనలు ఇచ్చింది. ఫస్ట్ లుక్ కోసం భారీత‌నం నిండిన బ్లాక్ అండ్ గోల్డ్ స్ట్రాప్‌లెస్ గౌను ధరించింది. బోల్డ్ షిమ్మ‌రీ దుస్తులలో కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడిచినప్పుడు ఐష్ త‌న‌దైన శైలిలో కెమెరాల ముందు చీర్స్ అందుకుంది. తన రెండవ లుక్ కోసం ఐశ్వర్య డిజైనర్ ఫల్గుణి షేన్ పీకాక్ డ్ర‌మ‌టిక్ నీలం -వెండి గౌనును ఎంచుకుంది. అయితే ఈ లుక్ పై విమ‌ర్శ‌లొచ్చాయి. నెటిజన్లు ఐష్‌ స్టైలిస్ట్ పేలవమైన పనితో ఆక‌ట్టుకోలేక‌పోయారు`` అని విమ‌ర్శించారు.

Tags:    

Similar News