పాతికేళ్లుగా ఎదురు చూస్తున్న కాంబో...!

ఇలాంటి సమయంలో శంకర్‌ మరియు అజిత్‌ కాంబో మూవీ వస్తే తమిళ సినీ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు పండగే.

Update: 2024-06-07 17:30 GMT

తమిళ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్, కమల్‌ హాసన్ ల తర్వాత ఆ స్థాయి క్రేజ్ ను దక్కించుకున్న హీరోల్లో అజిత్‌ ముందు వరుసలో ఉంటాడు అనడంలో సందేహం లేదు. తమిళ దిగ్గజ హీరోలతో సినిమాలను చేసిన లెజెండ్రీ దర్శకుడు శంకర్ ఇప్పటి వరకు అజిత్‌ తో సినిమాను చేయలేదు అనే విషయం తెల్సిందే.

 

ప్రస్తుతం రామ్‌ చరణ్ తో గేమ్‌ చేంజర్ ను రూపొందిస్తున్న దర్శకుడు శంకర్ మరో వైపు 'ఇండియన్ 2' సినిమాను విడుదల చేసే పనిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ నుంచి రాబోతున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అజిత్‌ తో శంకర్ భేటీ కాబోతుండటం చర్చనీయాంశం అయ్యింది.

గత పాతిక సంవత్సరాలుగా అజిత్‌ ఫ్యాన్స్ తో పాటు తమిళ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కాంబో మూవీ అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వీరి కాంబో మూవీ అతి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో శంకర్‌ దర్శకత్వంలో బిగ్‌ కమర్షియల్‌ సక్సెస్ రాలేదు. ప్రయోగాత్మక సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ఇండియన్ 2 మరియు గేమ్‌ ఛేంజర్ లపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో శంకర్‌ మరియు అజిత్‌ కాంబో మూవీ వస్తే తమిళ సినీ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులకు పండగే.

అజిత్‌ ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత మరో సినిమాకు కూడా కమిట్‌ అయ్యాడు. కనుక దర్శకుడు శంకర్ తో సినిమా కన్ఫర్మ్‌ అయితే అది ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Tags:    

Similar News