అఖండ 2 బోయపాటి ప్లాన్ అదుర్స్..!

ఆరు నెలల్లో అఖండ 2 సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈలోగా ఎన్.బి.కె 109వ సినిమా పూర్తి చేయాల్సి ఉంది.

Update: 2023-12-06 16:30 GMT
అఖండ 2 బోయపాటి ప్లాన్ అదుర్స్..!
  • whatsapp icon

బోయపాటి బాలకృష్ణ ఈ కాంబో సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే. బాలయ్య మాస్ ఇమేజ్ కి తగిన కథ కథనాలను అందిస్తూ సింహా, లెజెండ్, అఖండ ఇలా హ్యాట్రిక్ హిట్లతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేశాడు బోయపాటి. అన్నిటిలో అఖండ సినిమా సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఆ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. సినిమాలో ప్రతి క్రాఫ్ట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. బోయపాటి స్టోరీ, స్క్రీన్ ప్లేకి తగినట్టుగా థమన్ మ్యూజిక్ స్పీకర్లు బ్లాస్ట్ అయ్యేలా చేశాయి. అఖండ సూపర్ హిట్ కాగా వెంటనే అఖండ 2 ఉంటుందని చెప్పారు. కానీ ఈలోగా బాలకృష్ణ వేరే సినిమాలతో బిజీ అయ్యాడు.

రీసెంట్ గా బాలకృష్ణ భగవంత్ కేసరితో హిట్ అందుకోగా రామ్ తో స్కంద తీసి డిజాస్టర్ ఫేస్ చేశాడు బోయపాటి శ్రీను. ఇప్పుడు అఖండ 2 కోసం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖండ 2 కన్నా ముందు కోలీవుడ్ హీరో సూర్యతో ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని తెలిసినా అది ఇప్పుడప్పుడే వర్క్ అవుట్ అయ్యేలా లేదని బాలకృష్ణ సినిమా మీదే ఫోకస్ పెట్టాడు బోయపాటి.

ఆరు నెలల్లో అఖండ 2 సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈలోగా ఎన్.బి.కె 109వ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా వస్తుంది. ఈ సినిమా కూడా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఆ తర్వాత అఖండ 2 ఈసారి సోషియో ఫాంటసీ టచ్ కూడా ఇచ్చి సినిమాను నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

స్కంద టార్గెట్ మిస్సైనా అఖండ 2 తో మరోసారి తన డైరెక్షన్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు బోయపాటి. బాలయ్య బోయపాటి ఈ కాంబో ఏ సినిమా తీసినా హిట్ అనే సెంటిమెంట్ ఉంది అయితే ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఓ సూపర్ హిట్ సీక్వెల్ చేస్తున్నారు కాబట్టి ఆ సెంటిమెంట్ మరింత బలపడింది. మరి ఈసారి ఈ ఇద్దరు చేసే మాస్ మేనియా ఎలా ఉండబోతుందో చూడాలి. అఖండ 2 సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. అందుకు తగినట్టుగా కథని సిద్ధం చేస్తున్నారట బోయపాటి.

Tags:    

Similar News