ఐశ్వ‌ర్యంలో సౌతిండియా నంబ‌ర్.1 స్టార్?

భార‌త‌దేశంలో నం.1 ఆస్తిప‌రుడైన స్టార్ ఎవ‌రు? అంటే కింగ్ షారూఖ్ ఖాన్ గురించి చెబుతారు.

Update: 2024-08-29 11:04 GMT

భార‌త‌దేశంలో నం.1 ఆస్తిప‌రుడైన స్టార్ ఎవ‌రు? అంటే కింగ్ షారూఖ్ ఖాన్ గురించి చెబుతారు. ఆయ‌న ఆస్తుల విలువ సుమారు 6000 కోట్లు. షారూఖ్‌కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా విస్త‌రించిన సంగ‌తి తెలిసిందే. షారూఖ్ సినిమాలు, బ్రాండ్ ప‌బ్లిసిటీ స‌హా ప‌లు వ్యాపార‌ మార్గాల్లో భారీగా ఆర్జిస్తున్నారు. రియ‌ల్ వెంచ‌ర్ల‌లోను అత‌డు పెట్టుబ‌డులు పెడుతున్నాడు.


కింగ్ ఖాన్ త‌ర్వాత మ‌ళ్లీ ఆస్తిలో అంత‌టి వాడు ఎవ‌రున్నారు? అంటే క‌చ్ఛితంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల మాదాపూర్ లోని ఎన్.క‌న్వెన్ష‌న్ కూల్చివేత త‌ర్వాత నాగ్ ఆస్తుల గురించి ఎక్కువ చర్చ జ‌రిగింది. నేడు నాగార్జున పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న అభిమానుల్లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఒక అంచ‌నా ప్ర‌కారం నాగార్జున అక్కినేని ఆస్తులు సుమారు 3600 కోట్లు ఉంద‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. నాగ్ టాలీవుడ్ లోనే కాదు.. దేశంలోనే ప్ర‌భావ‌వంత‌మైన ధ‌నిక స్టార్ అన్న చ‌ర్చ అభిమాన‌ల్లో సాగుతోంది.

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆల్ రౌండ‌ర్‌ నైపుణ్యం, అత‌డి ఆర్జ‌న గురించి సాధార‌ణ ప్ర‌జ‌ల్లోను ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగుతోంది. లెజెండ్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట‌వార‌సుడిగా ప‌రిశ్ర‌మ‌లో ఆరంగేట్రం చేసినా, ఆ త‌ర్వాత స్టార్ గా తన‌దైన ముద్ర‌ వేసి ఇండ‌స్ట్రీ అగ్ర కథానాయ‌కుడిగా ఎదిగారు. స్టైల్ అన్న ప‌దానికి మీనింగ్ అత‌డు. ప‌రిశ్ర‌మ‌లో నాగార్జున ఒక ట్రెండ్ సెట్ట‌ర్. తండ్రి ఏఎన్నార్ లెగ‌సీని కాపాడ‌డ‌మే గాక‌.. అసాధార‌ణ‌మైన‌ హార్డ్ వ‌ర్క్, డెడికేష‌న్ తో అంచెలంచెలుగా ఎదిగిన‌ స్టార్. సినీరంగంతో పాటు, రియ‌ల్ ఎస్టేట్, హోట‌ల్ బిజినెస్‌లో అనుభ‌వ‌జ్ఞుడిగా ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో అత‌డు ఇంతింతై అన్న చందంగా ఎదిగార‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా సినిమా రంగంలో హీరోగా, నిర్మాత‌గా సంపాదించిన దాని కంటే అత‌డు ర‌క‌ర‌కాల వ్యాపార మార్గాల ద్వారా ఆర్జించిన‌ది అంత‌కుమించి ఉంద‌ని చెబుతారు.

1986లో `విక్ర‌మ్` సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి మూడు ద‌శాబ్ధాల కెరీర్ ని విజ‌య‌ప‌థంలో న‌డిపించారు. ఇప్ప‌టికి 90పైగా సినిమాల్లో న‌టించారు. మ‌రో రెండు మూడేళ్ల‌లోనే సెంచ‌రీ కొట్టేయ‌బోతున్నారు నాగార్జున‌. త‌న‌ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్లకు కొద‌వేం లేదు. దేశ‌వ్యాప్తంగా అద్భుత‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కింగ్ నాగార్జున‌. బాలీవుడ్ లో అమితాబ్ అంత‌టి బిగ్ స్టార్ తో క‌లిసి `ఖుదాగ‌వా` అనే చిత్రంలో న‌టించారు. ఇటీవ‌ల‌ క‌ర‌ణ్ జోహార్ `బ్ర‌హ్మాస్త్ర`లో అతిధి పాత్ర‌లో న‌టించారు. ఇలాంటి అసాధార‌ణ‌ రికార్డ్ ఉన్న నాగార్జున ఈ మూడు ద‌శాబ్ధాల్లో సంపాదించిన‌ ఘ‌న‌త ఎంతో ఉంది. ఏడాదికి రూ.30కోట్ల వార్షికాదాయంతో కింగ్ ఇన్నేళ్ల‌లో ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడ‌బెట్టిన ఆస్తులు ఉన్నాయి. ఈ నిక‌ర ఆస్తుల విలువ సుమారు 3600 కోట్లు ఉంటుందని అంచ‌నా.

హైద‌రాబాద్ లో ఆయ‌న నివ‌శించే బంగ్లా ఖ‌రీదు రూ.50 కోట్లు ఉంటుంద‌ని ఒక‌ అంచ‌నా. అన్న‌పూర్ణ‌ స్టూడియో విలువ రూ.200 కోట్లుగా అంచ‌నా వేస్తున్నారు. ఔట‌ర్ లో ఫామ్ హౌస్ లు, స్థ‌లాల‌పైనా పెట్టుబ‌డులు పెట్టార‌ని, విదేశీ హోట‌ల్ రంగంలోను నాగార్జున పెట్టుబ‌డులు మంచి ఫ‌లాల్ని ఇస్తున్నాయ‌ని చ‌ర్చ ఉంది. నాగార్జున‌ ఇంటి గ్యారేజ్ లో ఖ‌రీదైన కార్ల‌కు కొద‌వేం లేదు. రేంజ్ రోవ‌ర్ ఎవోక్ -65 ల‌క్ష‌లు, ఆడి ఏ7- 1.02కోట్లు, బీఎండబ్ల్యూ 7 సిరీస్- 1.32 కోట్లు, మెర్సిడెస్ ఎస్ క్లాస్ -3కోట్లు విలువ‌ను క‌లిగి ఉన్నాయి. ఇంకా ప‌లు ర‌కాల స్పోర్ట్స్ గూడ్స్, గాడ్జెట్స్ విలువ కోట్ల‌లోనే ఉంటుంది. ఇక హైద‌రాబాద్ లోని ఖ‌రీదైన ప్రైమ్ ఏరియాలో ఉన్న ఎన్- క‌న్వెన్ష‌న్ కొన్ని ఎక‌రాల్లో విస్త‌రించి ఉన్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలో ప‌లు చోట్ల ప‌బ్స్, ఖ‌రీదైన రెస్టారెంట్స్, క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులు నాగార్జున ర‌న్ చేస్తున్నారు. వీట‌న్నిటి నుంచి వార్షికాదాయం అసాధార‌ణంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ (రికార్డింగ్‌, డ‌బ్బింగ్, డిజిట‌ల్, అన్న‌పూర్ణ ఫిలింస్కూల్ వ‌గైరా), అన్న‌పూర్ణ ఏడెక‌రాల్లో ఇండోర్ స్టూడియోస్ వంటివి ఆయ‌నకు ఆదాయాల్ని అందిస్తున్నాయి. ర‌క‌ర‌కాల మార్గాల్లో సినీప‌రిశ్ర‌మకు నాగార్జున కుటుంబం సేవ‌లు అందిస్తోంది.

నాగార్జున‌ ఒక్కో సినిమాకు 20-30 కోట్ల పారితోషికం అందుకుంటార‌ని స‌మాచారం. బిగ్ బాస్ హోస్ట్ గా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. నాగార్జునకు క్రీడలంటే ఆసక్తి. అందుకే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో `ముంబై మాస్టర్స్` టీమ్‌ను సొంతం చేసుకున్నారు.

Tags:    

Similar News