ఇద్దరు స్టార్ హీరోలతో ఒకేసారి ఒకేఒక్కడు!
కింగ్ నాగార్జున కి మల్టీస్టారర్ చిత్రాలు చేయడం కొత్తేంకాదు. స్టోరీ డిమాండ్ చేస్తే తోటి స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం అన్నది ఆయనకి అలవాటైన పనే.
కింగ్ నాగార్జున కి మల్టీస్టారర్ చిత్రాలు చేయడం కొత్తేంకాదు. స్టోరీ డిమాండ్ చేస్తే తోటి స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం అన్నది ఆయనకి అలవాటైన పనే. ఆయన ఇండస్ట్రీలో కింగ్ కాక ముందు నుంచే ఆ రకంగా సినిమాలు చేస్తున్నారు. ఏఎన్నార్, ఎన్టీఆర్, శోభన్ బాబ్, కృష్ణ జనరేషన్ తర్వాత తరం హీరోల్లో మల్టీస్టారర్ సినిమాలు చేసిన హీరో ఎవరంటే? నాగార్జున పేరే వినిపిస్తుంది.
ఆయన తర్వాతే మిగతా హీరోలంతా ఆ తరహా సినిమాలవైపు ఆసక్తి చూపించారు అన్నది వాస్తవం. వెంకటేష్, మహేష్ , చిరంజీవి లాంటి స్టార్లు సైతం కింగ్ తర్వాతే మల్టీస్టారర్ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికీ నాగ్ అదే పంథాలో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలతో కింగ్ పనిచేయడం ఇంట్రెస్టింగ్. `కుభేర` చిత్రంలో ధనుష్ తో పాటు నాగార్జున నటిస్తోన్న సంగతి తెలిసిదే.
ఇందులో రా ఆఫీసర్ పాత్రలో నాగ్ నటిస్తున్నట్లు ప్రచారం లో ఉంది. మరికొంత మంది ధనుష్ పాత్ర కి ధీటుగా నాగ్ ఇమేజ్ ని ఏమాత్రం తగ్గించుకుండా దర్శకుడు శేఖర్ కమ్ములా ఆ పాత్రని తీర్చి దిద్దుతున్నాడు అనే ప్రచారం బలంగా జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో సైతం కింగ్ నటిస్తున్నారు. రజనీ హీరోగా లోకేష కనగరాజ్ కూలీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
తొలుత ఈ ప్రాజెక్ట్ లో నాగార్జున పేరు వినిపించలేదు. కానీ షూటింగ్ మొదలైన తర్వాత అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఒకేసారి రజనీకాంత్, ధనుష్ తో కలిసి పని చేస్తున్న తెలుగు స్టార్ హీరోగా నాగార్జున హైలైట్ అవుతున్నారు. రజనీకాంత్ సూపర్ స్టార్ అయిన తర్వాత ఇతర స్టార్ హీరలతో సినిమాలు చేసింది లేదు. ఆయన ద్విపాత్రాభినయం చేయడం తప్ప..ఇతర హీరోలతో తెరను పంచు కోలేదు. ఆ రకంగా నాగార్జున -రజనీ తొలిసారి ఒకే ప్రేమ్ లో కనిపించడం విశేషం. నాగార్జున లాంటి స్టార్లను స్పూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన ధనుష్ తో పనిచేయడం విశేషమే.