రంగలో మాస్ మాత్రమే కాదు..ఆయన లో క్లాస్ ఉందే!
కొన్ని పోస్టర్స్ లో నాగ్ ని ఎంత మాస్ గా చూపించారో? మరికొన్ని పోస్టర్స్ లో కొంత స్టైలిష నెస్ హైలైట్ అవుతుంది
కింగ్ నాగార్జున 99వ చిత్రం 'నా సామిరంగ'కి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన కింగ్ మాస్ లుక్ తోనే కంటెంట్ ఎలా ఉండబోతుంది? అన్న ఓ అంచనా మొదలైంది. నాగార్జునని ఇలాంటి మాస్ లుక్ లో చూసి చాలా కాలమవుతుంది. ట్రెండ్‌ని ఫాలో అవ్వాల్సిన అవసరం రావడంతో నాగార్జున కూడా రొటీన్ కి భిన్నమైన సినిమాల్లోకి వెళ్లిపోయారు.
ఈ కోవలో ఎక్కువగా డిఫరెంట్ కంటెంట్ కే ప్రాధాన్యత ఇచ్చారు. మధ్య మధ్య లో 'బంగార్రాజు' లాంటి సినిమాలో మాస్ పాత్రలు పోషించినా! అక్కినేని అభిమానులకు సరిపడ్డ మాస్ కిక్ కాదది. కింగ్ నుంచి అంతకు మించి ఎక్సపక్టేషన్స్ ఉంటాయి. ఆ రకంగా కొన్ని రకాల అంచనాల్ని కింగ్ అందుకోలే కపోయారు. అయితే తాజాగా 'నా సామిరంగ' లో కొత్త దనంతో పాటు మాస్ కోణంలో సినిమా సాగుతుందని చెప్పొచ్చు. రెండింటిని మిక్స్ చేసి దర్శకుడు ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
కొన్ని పోస్టర్స్ లో నాగ్ ని ఎంత మాస్ గా చూపించారో? మరికొన్ని పోస్టర్స్ లో కొంత స్టైలిష నెస్ హైలైట్ అవుతుంది. ఇదిగో ఈ పోస్టర్ లో నాగ్ లో మాస్ కోణాన్ని చెబుతూనే..అతనిలో క్లాస్ హీరోని చూపించారు. ఎర్ర చొక్కా వేసి ముందు బటన్ విప్పేసినంత మాత్రాన మాస్ కాడు. నాగార్జున క్లాస్ గా ఓ స్మైల్ ఇస్తే క్లాస్ అలా పడి ఉంటారు? అనేలా ఇది కనిపిస్తుంది. ఇందులో నాగార్జున గుబురు హెయిర్ స్టైల్..కోర మీసాలు..గెడ్డం అన్ని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.
'ది ఘోస్ట్' తర్వాత నాగార్జున నుంచి కొత్త సినిమా ప్రకటన రావడానికి ఎంత సమయం పట్టిందో తెలిసిందే. హిట్ కంటెంట్ తోనే రావాలని ఇంత సమయం తీసుకున్నారు. బెజవాడ ప్రసన్న కుమార్ తో ఓ సినిమా చేయాల్సి ఉండగా...ఆ ప్రాజెక్ట్ పై మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో! ఉందా? లేదా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. ఇంతలో 'నా సామిరంగ' అంటూ కింగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు.