కాస్ట్ ఎక్కువని కూర్చోమన్నాడా?
అభిమానులు కోరితే ఏ హీరో కాదంటాడు. తప్పకుండా వాళ్ల కోరికలు నెరవేర్చడానికే మేము ఉన్నామంటూ చెబుతుంటారు
అభిమానులు కోరితే ఏ హీరో కాదంటాడు. తప్పకుండా వాళ్ల కోరికలు నెరవేర్చడానికే మేము ఉన్నామంటూ చెబుతుంటారు. అభిమానుల కోసమే హీరోలు ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్లు బాగుంటే మేము బాగుంటాం..ఇండస్ట్రీ బాగుంటుందని హీరోలంతా నమ్ముతారు. అందుకే అభిమానులొచ్చి హీరోల కాళ్ల మీద పడితే ఓ సెల్పీ ఇచ్చి పంపిస్తారు. కానీ ఇక్కడ అభిమానం వేరు గురూ అనిపించారు కింగ్ నాగార్జున.
ప్రస్తుతం ఆయన హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 7 రన్నింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ కి నాగార్జున పసుపు వర్ణం తోకూడిన షార్ట్ స్లీవ్డ్ స్వెటర్ ధరించారు. డిజైన్ చూడటానికి చాలా బాగుంది. వేసుకుంటే మంచి లుక్ ఉంది. దీంతో ఆ టీషర్ట్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్ దీప్ మనసు పడ్డాడు. ఎలాంటి సంకోచం లేకుండా నాగార్జున ముందుకొచ్చి ఆ టీషర్ట్ నాకు కావాలి అని అడిగాడు అమరదీప్.
దీంతో నాగార్జున మరో మాట లేకుండా కూర్చో అనేసారు. అంటే ఆ టీషర్ట్ ఇవ్వడం నాగార్జునకు ఇష్టం లేదని తేలిపోయింది. అందుకే నో అనలేక కూర్చో అని సరిపెట్టారు. దీంతో నాగ్ ఆ టీషర్ట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కంటెస్టెంట్ కోరిక ని నాగ్ ఎందుకు తిరస్కరించినట్లు? ఏంటి కథా అంటూ ఆ టీషర్ట్ గురించి నెట్టింట డిస్కషన్ మొదలైంది. దీంతో ఆ టీషర్ట్ వెనుక చాలా కథే ఉందని తెలుస్తోంది.
అది క్రిస్టియన్ డియోర్ బ్రాండ్ కి చెందిన ఖరీదైన టీషర్ట్. దాని ధర ఆన్ లైన్ లో రెండు లక్షలకు పైగానే ఉంది. దీంతో ధర చూసి అంతా షాక్ అయ్యారు. రెండు లక్షల రూపాయల టీషర్ట్ అడగ్గానే నాగార్జున కూర్చోమనడంలో తప్పేం లేదని తెలుస్తోంది. అయినా ఆ టీషర్ట్ నాగార్జున సొంత డబ్బుతో కొనుకున్కది కాదు. బిగ్ బాస్ నిర్వాహకులు షో కోసం పర్చేజ్ చేసింది. దాన్ని షో ముగిసిన వెంటనే నాగార్జున తీసి ఇచ్చేయాలి. కాబట్టి అమరదీప్ అడిగాడని నాగార్జున సొంత నిర్ణయంతో ఇచ్చేయడానికి వీలు లేదు. షో అంటే కొన్ని టెర్మ్స్ అండ్ కండీషన్స్ అనేవి కూడా ఉంటాయి కదా.